twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ దర్శకుడు కన్నుమూత!

    |

    సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే తెలుగు సహా దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీలో చాలామంది సుప్రసిద్ధ కళాకారులు దూరమయ్యారు. తాజాగా ప్రముఖ కవి, బెంగాలీ దర్శకుడు బుద్ధదేబ్ దాస్‌ గుప్తా కన్నుమూశారు. 77 సంవత్సరాల వయస్సు గల ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. కలకత్తా లో ఉన్న తన నివాసంలో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు గా ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.. ఉత్తమ దర్శకుడిగా ఆయన రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.

    అలాగే ఆయన చేసిన సినిమాలకు మొత్తంమీద పన్నెండు నేషనల్ అవార్డులు రావడం ఆసక్తికర అంశం అని చెప్పాలి. ఇక గుప్త మరణానికి సంబంధించి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఆయన తీసిన బాగ్ బహదూర్ (1989), చరాచర్ (1993), లాల్ దర్జా (1997), మొండో మెయెర్ ఉపక్యాన్ (2002), కాల్ పురుష్ (2008) సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆయన అనేక సంచలనాత్మక సినిమాలతో పాటు,పలు డాక్యుమెంటరీలు కూడా రూపొందించారు.

    National Award-winning Bengali filmmaker Buddhadeb Dasgupta passes away

    దూరత్వా (1978), తహదర్‌ కథ (1993) సినిమాలకు గాను బెంగాలీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇవి కాక ఆయన ఉత్తరా (2000), స్వాప్నర్‌ దిన్‌ (2005) వంటి చిత్రాలకు ఉత్తమ దర్శకుడు అవార్డును కూడా అందుకున్నారు. ఇక 2019లో పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ బుద్ధదేవ్‌ కు దివంగత సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఇక ఆయన మృతితో బెంగాలీ సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు పరిశ్రమ పెద్దలు, అభిమానులతోపాటు, నిర్మాత, రాజ్ చక్రవర్తి తదితరులు దాస్‌గుప్తా మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Veteran Bengali filmmaker Buddhadeb Dasgupta passed away Thursday morning at his Kolkata residence. The 77-year-old had been suffering from kidney ailments for years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X