twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను లోకల్ దర్శకుడి లైనప్ మాములుగా లేదుగా.. వంద ఇస్తే చాలు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాడు

    |

    టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద హీరోలు చిన్న హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నిర్మాతలకు హీరోలు దొరుకుతున్నారు గాని మంచి సక్సెస్ ఫుల్ దర్శకులు మాత్రం దొరకడం లేదు. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించే దర్శకులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అందులో నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.

     ఎక్కువగా ఆ రైటర్ తోనే..

    ఎక్కువగా ఆ రైటర్ తోనే..

    కథలు సెట్ చేసుకునే హీరోలకు విభిన్నమైన దర్శకులు దొరకడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దర్శకులకు హీరోలు దొరికినంత ఈజీగా కథలు తట్టడం లేదు. అందుకే వారు సొంతంగా రాసుకోవడమే కాకుండా ఇతర రచయితల నుంచి కూడా కథలను కొనుక్కుంటున్నారు. ఇక త్రినాథరావు నక్కిన కూడా ఎక్కువగా రైటర్ ప్రసన్న కుమార్ నుంచి కథలు రాయించుకుంటూ ఉన్నారు.

     ఆ హిట్టుతో తరువాత

    ఆ హిట్టుతో తరువాత

    మేం వయసుకు వచ్చాం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత వరుణ్ సందేశ్ తో రెండు సినిమాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక నాలుగవ మూవీ 'సినిమా చూపిస్తా మవ' బాక్సాఫీస్ వద్ద సాలీడ్ గా హిట్టవ్వడంతో దర్శకుడి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగి పోయింది.

    రామ్ చరణ్, అల్లు అర్జున్..

    రామ్ చరణ్, అల్లు అర్జున్..


    సినిమా చూపిస్తా మవ అనంతరం అతనిలో మంచి మాస్ దర్శకుడు ఉన్నాడని రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి దర్శకులు ప్రత్యేకంగా కాఫీకి పిలిచి మాట్లాడారు. కానీ దర్శకుడు వారితో సినిమా చేస్తానని ఏమి అనకుండా వచ్చేశాడట. ఎదో ఫ్రెండ్లిగా పిలిచారని అనుకున్నాడట. అయితే స్టార్ హీరోతో కథ సెట్టయితే గాని నేను ఆఫర్ వచ్చినా పట్టించుకోనని ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

     నాలుగు సినిమాలు

    నాలుగు సినిమాలు

    ఇక నేను లోకల్ ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే హలో గురు ప్రేమ కోసమే కూడా మంచి రిజల్ట్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం త్రినాథరావు లైనప్ లో నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ అతను రవితేజ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

    100 రూపాయల అడ్వాన్స్..

    100 రూపాయల అడ్వాన్స్..

    ఇక ఇదివరకే వెంకటేష్ తో ఒక సినిమా చేయాలని అనుకోగా కరోనా వలన అది వాయిదా పడింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు నాగశౌర్య హోమ్ బ్యానర్ లో కూడా ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చినట్లు చెప్పారు. ఎవరైనా నిర్మాతలు సినిమా చేయమని అడ్వాన్స్ ఇస్తే తీసుకోవడం తనకు ఇష్టం ఉండదని అందుకే కొందరి మనసు నొప్పించకుండా 100రూపాయలు తీసుకున్న సందర్బాలు ఉన్నట్లు త్రినాథరావు వివరణ ఇచ్చారు.

    English summary
    In Tollywood right now everyone is giving the green signal to four movies regardless of whether the big heroes are small heroes. Producers are finding heroes but not successful directors. There is a good demand now for directors who screen good entertainment movies. In it I also had local director Trinadha rao Nakkina. Currently, the director is committed to four films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X