twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్‌ఫ్లిక్స్ అభిమానులకి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సబ్‌స్క్రిప్షన్‌ ధరలు!

    |

    ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ హవా ఎక్కువైన అనంతరం సినిమా ఇండస్ట్రీలలో కూడా చా మార్పులు వచ్చాయి. ప్రత్యేకంగా అక్కడ ఒక మార్కెట్ ఏర్పడడంతో సినిమాలకు విడుదలకు ముందే మంచి లాభాలు వస్తున్నాయి. ఇక ఓటీటీ సంస్థలు ఏకంగా కొన్ని సినిమాలను డైరెక్ట్ గా విడుదల చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రత్యేకంగా వెబ్ కంటెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో అత్యధిక మార్పులు తెచ్చిన అతిపెద్ద ఓటీటీ కంపెనీలలో నెట్‌ఫ్లిక్స్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఇటీవల ఈ సంస్థ ఇండియాలో సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ లను భారీగా తగ్గించడం విశేషం.

    అమెరికన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ భారతదేశం కోసం కొత్త ధరల ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి అలాగే దేశంలో మరింత మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని ఈ సంస్థ రేట్లను భారిగానే తగ్గించి కొత్త తరహా ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్ అంటేనే చాలా కాస్ట్లీ గురు అన్నట్లుగా ఉండేది.

    Netflix has introduced a range of new price plans for India

    మొన్నటి మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ నెలకు 199రూపాయలకు వచ్చేది.. ఇక మొబైల్ ప్లాన్ 149 రూపాయలకు లభిస్తోంది. ఏదైనా ఒక పరికరంలోని మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ని అనుమతించే విదంగా ప్రాథమిక ప్లాన్ కు గణనీయంగా రూ.199కి రావడం విశేషం. ఇదివరకు రూ.499 ధర తీసుకునేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఇక నాలుగు పరికరాలలో పనిచేసే ప్రీమియం ప్లాన్ ధర కూడా రూ.649 లభిస్తోంది. ఈ రేట్లు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి.

    అయితే కొత్త ధర ప్రణాళికలతో దేశంలోకి స్పీడ్ గా వెళ్లే కంటెంట్‌ను అందించడానికి మా వ్యూహానికి అనుగుణంగా ఉన్నాయని ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించడానికి టార్గెట్ గా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మీడియాకు తెలియజేశారు. ఈ సారి తమ ప్లాట్‌ఫారమ్ లో విభిన్నమైన కంటెంట్ ని పరిచయం చేస్తున్నాము అంటూ ఇప్పటికే ఇండియా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చాలా సినిమాలను నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఇక డబ్బింగ్ మరియు సబ్‌టైటిలింగ్‌లో కూడా ఇతర లాంగ్వేజ్ కు సంబంధించిన సినిమాలు ఎక్కువగా రానున్నాయని మాస్‌ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు మరియు సిరీస్‌లు నిర్మించినున్నట్లు షెర్గిల్ చెప్పారు.

    గత కొన్ని నెలలుగా ఇండియాలో ఓటీటీ కంటెంట్ కు ఆదరణ ఎక్కువగా పెరిగిందని ముఖ్యంగా పాండమిక్ లో ఇక్కడ ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య అమాంతంగా పెరిగిపోవడంతో నెట్ ఫ్లిక్స్ ని మరింత తక్కువ ధరకు అందిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత వినియోగదారులు తాము చెల్లిస్తున్న ధరలో మరిన్ని ప్రయోజనాలకు అప్‌ గ్రేడ్ అయ్యే అవకాశం ఉందని లేదా అదే ప్రయోజనాలను పొందడం కోసం తక్కువ ధరకు వెళ్లే అవకాశం ఉందని షెర్గిల్ చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ అనంతరం డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ధర ప్లాన్‌లను ప్రవేశ పెడుతోంది, ఇందులో మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.499 ఉండగా రెండు డివైస్ లకు సంవత్సరానికి రూ.899 కేటాయించారు. నాలుగు డివైస్ లలో సంవత్సరానికి రూ.1,499 లను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక హాట్ స్టార్ VIP కోసం సంవత్సరానికి రూ.399 మరియు ప్రీమియం కోసం రూ.1,499గా కేటాయించింది.

    English summary
    Netflix has introduced a range of new price plans for India,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X