Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
‘ఎర్రచీర’ బ్యానర్ నుంచి మరో కొత్త సినిమా.. వచ్చే నెల ప్రారంభం
'మహానటి' ఫేం బేబి సాయి తేజస్విని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'ఎర్రచీర' ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌కు రాజేంద్ర ప్రసాద్, అనిల్ రావిపూడి లాంటి వారు హాజరై హైప్ పెంచేశారు. ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ ఉన్న కథకు... హారర్‌ని టచ్ చేశామని చెప్పిన యూనిట్.. సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉన్నారు.
ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యారు. శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బేనర్ పై ప్రొడక్షన్ నెం 2గా బేబీ దమరి సమర్పణలో సి.హెచ్ సత్య సుమన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్ననూతన చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తమ ప్రొడక్షన్‌లో రాబోతోన్న ఈ రెండో చిత్రం జనవరి 27 నుండి ప్రారంభం కానుందని పేర్కొన్నారు.

దర్శక నిర్మాత సి. హెచ్ సత్య సుమన్ బాబు మాట్లాడుతూ .. ఒక ఐ.ఎ.ఎస్ అధికారి అవినీతి పై పోరాటం చేసి దాన్ని పూర్తిగా ఎలా అంతమొందించారు అని తెలియజెప్పే మంచి సందేశాత్మక చిత్రం ఇదని పేర్కొన్నారు. జనవరి 27 నుండి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపాడు. ఈ చిత్రానికి కథ, మాటలు కె.బాలకిషోర్ అందిస్తుండగా.. ప్రమోద్ కుమార్ స్వరాలు సమకూర్చనున్నారని తెలిపాడు. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోందని, ఆ వివరాలను త్వరలోతెలియజేస్తామని అన్నారు.