Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మహేశ్ బాబు మూవీలో టాలెంటెడ్ హీరోయిన్: ఇంకా ఓకే చెప్పలేదంటున్నారే
కొంత కాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌లోనే ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఎప్పుడో ప్రకటించినా ఇది కేవలం ఒక షెడ్యూల్‌ను మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడిపోయింది. ఇక, ఈ చిత్రం పట్టాలపై ఉండగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించేశాడు.

'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవలే వెలువడింది. ఈ సినిమా కాస్ట్ విషయంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర కోసం టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్‌ను తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమచారం ప్రకారం.. ఈ సినిమాకు ఆమె ఇంకా సంతకం చేయలేదట. దీనికి కారణం డేట్స్ ఇష్యూనే అని అంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత తన సినిమాలకు కాల్షీట్స్ కేటాయించిన తర్వాతనే దీని గురించి చెబుతానని ఆమె అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడని తెలుస్తోంది. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రానికి 'పార్థు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి.