For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హరిహర వీరమల్లులో మరో బాలీవుడ్ బ్యూటీ: అందాల విందు చేయనున్న హీరోయిన్

  |

  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే అదిరిపోయే హిట్లను అందుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది అనుకున్న రీతిలో స్పందనను అందుకుని భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ స్టార్ హీరో మరిన్ని సినిమాలు పట్టాలెక్కించాడు.

  హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

  కొద్ది రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో దగ్గుబాటి రాణా కీలక పాత్రలో నటించాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు. కానీ, మొత్తంగా ఈ చిత్రం 97 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను రాబట్టి సత్తా చాటుకుంది.

  Nora Fatehi Key Role in Harihara Veeramallu

  చాలా రోజుల క్రితమే పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రంలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో పాటు పవన్ కల్యాణ్ బ్రేక్ తీసుకున్నాడు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను యూనిట్ ఇటీవలే మొదలు పెట్టింది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి మరీ ఘాటుగా!

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ బాలీవుడ్ భామ నపూర్ సనన్ ఇందులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టార్ పేరు తెరపైకి వచ్చింది. తన అందచందాలతో హిందీ చిత్ర పరిశ్రమను ఊపేస్తోన్న నోరా ఫతేహీ కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఆమె గ్లామరస్ రోల్‌ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రే అయినా.. ఇది చేసేందుకు నోరా ఎంతో ఆసక్తిని కనబరిచినట్లు ప్రచారం జరుగుతోంది.

  'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  English summary
  Power Star Pawan Kalyan Now Doing Harihara Veeramallu under Krish direction. Nora Fatehi to Play Key Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X