క్రిష్‌పై బాలీవుడ్ నటుడు ప్రశంసలు.. గొప్ప పాత్రలో నటించడం అదృష్టమని ట్వీట్

ప్రతిష్టాత్మకం రూపుదిద్దుకొంటున్న ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి పండుగకు రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నది. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తయ్యే క్రమంలో ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌ను కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బయోపిక్‌లో బెంగాలీ, బాలీవుడ్ నటుడు జిష్షు సేన్ గుప్తా ప్రముఖ నిర్మాత, దర్శకుడు దివంగత ఎల్‌వీ ప్రసాద్‌ పాత్రలో నటించాడు. ఎల్వీ ప్రసాద్‌ పాత్రకు సంబంధించిన సీన్లను ఇటీవల జిష్షుపై చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా క్రిష్‌కు జిష్షుసేన్ గుప్తా సోషల్ మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్పారు. ఎల్వీ ప్రసాద్ పాత్రలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టవంతుడిని అని పేర్కొన్నారు.

 NTR biopic: Jisshu Sengupta thanks director Krish Jagarlamudi

నందమూరి బాలకృష్ట ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో బసవతారకంగా విద్యాబాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, నారా చంద్రబాబుగా రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వర్ రావుగా సుమంత్ నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ నటించారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి, నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X