దెయ్యమైన చిన్నారి పెళ్లి కూతురు.. వైరల్ లుక్
యాంకర్‌గా ఆడియన్స్‌కి దగ్గరైన ఓంకార్ మెగా ఫోన్ పట్టి దర్శకుడి అవతారమెత్తాడు. డిఫెరెంట్ జానర్‌లో హారర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో 'రాజుగారి గది' సిరీస్ మొదలు పెట్టిన ఆయన.. ఇప్పటికే రెండు భాగాలు పూర్తి చేసి మూడో భాగం కోసం కసరత్తులు చేస్తున్నాడు.
రాజుగారి గది మొదటి భాగం అందించిన సక్సెస్ 'రాజుగారి గది 2' అందించలేక పోయింది. అక్కినేని నాగార్జున, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆశించిన మేర ఆదరణ లభించలేదు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రాజుగారి గది 3 సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యారు ఓంకార్. హారర్ జానర్ లోనే విభిన్న కథాంశాన్ని ఎన్నుకొని ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసిన ఆయన జూన్ 20వ తేదీన సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికా గోర్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్‌లో దెయ్యంగా అవికా గోర్ వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఫీమేల్ ఓరియెంటెడ్ హారర్ సినిమా కావడంతో ఈ సినిమా ద్వారా అవికా గోర్ మంచి నటిగా గుర్తింపు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. గతంలో ఆమె 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మామ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











