42 గంటల్లో 1 మిలియన్.. OG తో చరిత్ర సృష్టించిన వన్స్‌మోర్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన OG చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పలు భాషల్లో భారీగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా సోషల్ మీడియాలోనే కాకుండా, ఆన్‌లైన్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం ఓవర్సీస్‌లో ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లకు కారణమైన ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ కూడా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..
ఓజీ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ను విదేశాల్లో ఒక నెల రోజుల ముందుగానే ఓపెన్ చేశారు. అయితే ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ లభించాయి. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ను ముందే పసిగట్టిన గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ఏకంగా ఆన్‌లైన్ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ OnceMore.io అనే యాప్‌ను, వెబ్ సైట్‌ను ఓపెన్ చేసింది. ఓజీ మూవీతో ఈ వెబ్ సైట్ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొన్నది.

కంటెంట్ బేస్డ్ వెబ్‌సైట్‌కు అనూహ్యమైన అదరణ లభించింది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే రికార్డు స్థాయిలో యూజర్స్ తమ ఖాతాలను ఓపెన్ చేశారు. కేవలం 42 గంటల్లోనే 60 దేశాల్లో 1 మిలియన్ అంటే.. సుమారుగా 10 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకొన్నది. ఓజీ కారణంగా ఈ వెబ్‌సైట్ సృష్టించిన ప్రభంజనం ఎంతగా ఉందంటే.. ఏకంగా చాట్ జీపీటి, టిక్ టాక్, స్పార్టీఫై లాంటి ఫాట్‌ఫామ్‌ల యూజర్లను అధిగమించింది అని నిర్వాహకులు వెల్లడించారు.
OnceMore.io ప్రారంభానికి ముందు ఓజీ దర్శకుడు సుజిత్‌తో ఓ వీడియోను షూట్ చేసి రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభం సమయంలో ఓజీ సినిమా కంటెంట్‌ను రిలీజ్ చేయడానికి అభిమానులను ఆహ్వానించగా.. మంచి స్పందన లభించింది. లేటేస్ట్ AI టెక్నాలజీతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో జరిగే కార్యక్రమాలు, టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు మరింతగా అడుగులేస్తున్నది. సినిమా ప్రేక్షకులకు మరింత చేరువగా కానున్నది.
ఓజీ చిత్రం తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో OnceMore.io వెబ్ సైట్ ఒప్పందం కుదుర్చుకొన్నది. త్వరలోనే ఆ సినిమా వివరాలను వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. తెలుగు, ఇతర భాషల సినిమాలతో కూడా ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయి వినోదాన్ని అందించే ఫ్లాట్‌ఫామ్‌గా రూపొందించేందుకు ఈ సంస్థ సిద్దమవుతున్నదని తెలిపారు.


Click it and Unblock the Notifications











