Salman khan: సల్మాన్ ఖాన్ ఓ ఉగ్రవాది.. పాకిస్తాన్ సంచలన ప్రకటన.. అసలేం జరిగిందంటే?
Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఘోర అవమానం జరిగింది. గత కొన్ని రోజులుగా దాయాదీ దేశం పాకిస్థాన్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన. తాజాగా పాక్ మరో అడుగు ముందుకేసింది. హీరో సల్మాన్ ఖాన్ ఏకంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ దేశ చట్టాల ప్రకారం.. ఆయన్ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంతకీ ఏం జరిగింది? పాకిస్థాన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటీ?
ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం-2025 కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ వేడుకకు ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖ నటులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమాలు అంతర్జాతీయంగా విజయాలు సాధించడంపై సల్మాన్ ఇలా అన్నారు. "ఇప్పుడు మీరు ఒక హిందీ సినిమా తీసి సౌదీ అరేబియాలో విడుదల చేస్తే అది సూపర్‌హిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బలూచిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా వంటి వివిధ దేశాల ప్రజలు పనిచేస్తున్నారు." అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలో సల్మాన్ "బలూచిస్తాన్", "పాకిస్తాన్"ను వేర్వేరు దేశాలుగా ప్రస్తావించడం పాక్ ప్రభుత్వాన్ని మండిపడేలా చేసింది. ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పాక్ రాజకీయ నాయకులు, మీడియా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాదులు మాత్రం సల్మాన్ వ్యాఖ్యలను స్వాగతించారు. కానీ, సల్మాన్ ఖాన్‌పై గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ కోపంగా ఉంది. ఆయనపై పాక్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం-1997 నాలుగవ షెడ్యూల్ కింద సల్మాన్ పేరును చేర్చినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ చట్టం ప్రకారం, ఉగ్రవాద కార్యకలాపాల్లో నేరుగా లేదా పరోక్షంగా ప్రమేయమున్నవారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతారు. ఇలా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల కదలికలపై.. పాకిస్తాన్ చట్టాల ప్రకారం నిఘా పెడతారు. వారిపై ఆంక్షలు విధిస్తారు. అవసరమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.
ఇకపై సల్మాన్ ఖాన్ పాకిస్తాన్‌లో అడుగుపెడితే ఆయనపై పలు ఆంక్షలు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఆయన పాక్‌లోని వ్యాపార సంబంధాలు లేదా సినిమా రిలీజ్‌లు కూడా రద్దు కావచ్చని చెబుతున్నారు.
పాకిస్తాన్ మీడియా సల్మాన్ వ్యాఖ్యలను "దేశ విభజనకు మద్దతు"గా అభివర్ణించింది. "బలూచిస్తాన్ వేర్పాటును ప్రోత్సహించేలా ఆయన మాట్లాడారు" అని పాక్ పత్రికలు రాసాయి. పాక్ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్‌కు చెందిన రాజకీయ వర్గాలు సల్మాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాక్ టెలివిజన్ చానెల్ ఆయనను "బాలీవుడ్ ఉగ్రవాది"గా పిలిచింది. మరికొందరు ఆయనపై "ఇండియన్ ప్రొపగాండా" నడిపిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను స్వాగతించారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాట నాయకుడు మీర్ యార్ బలూచ్ మాట్లాడుతూ.. "సల్మాన్ వ్యాఖ్యలు మా ప్రజలకు మానసిక బలం ఇచ్చాయి. ఆరు కోట్ల బలూచిస్తానీ ప్రజలకు ఇది గౌరవం. ప్రపంచం మాకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది" అన్నారు. వారు సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, "చాలా దేశాలు బలూచిస్తాన్ అంశంపై మౌనంగా ఉంటున్నాయి. కానీ సల్మాన్ ఖాన్ దానిని గ్లోబల్ స్టేజ్‌పై ప్రస్తావించడం ధైర్యమైన చర్య" అని పేర్కొన్నారు.
పాక్ నిర్ణయంపై సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. "పాక్‌కు ఉగ్రవాది అంటే అర్థమే తెలియదు." "బలూచిస్తాన్ పేరే వినిపించినా పాక్ గజగజ లాడిపోతోంది." "సల్మాన్ మాటకు అంత భయం ఉందంటే ఆయన గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎంత ఉందో అర్థం." ఇలా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనతో బాలీవుడ్-పాక్ సంబంధాలను ఏ దిశలోకి తీసుకెళ్తుందో చూడాలి. అలాగే సల్మాన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











