twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vani Jairam passed away పద్మభూషణ్ అందుకోకుండానే.. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రోజా ఎమోషనల్

    |

    ప్రముఖ గాయని, మ్యూజిక్ లెజెండ్ వాణి జయరాం ఇకలేరనే వార్త అభిమానులను గుండె పగిలేలా చేసింది. కళాతపస్వి కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా కోలుకోకముందే మరో విషాద సినీ, సంగీత అభిమానులను వెంటాడింది. ఫిబ్రవరి 4వ తేది శనివారం ఉదయం చెన్నైలోని నుంగంబాకంలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మరణించడం అందరిలోను విషాదం నింపింది. సినీ ప్రముఖులు బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రోజా తదితరులు సంతాపం తెలియజేస్తూ..

    మూడు సార్లు జాతీయ అవార్డు

    మూడు సార్లు జాతీయ అవార్డు


    గాన కోకిల వాణీ జయరాం మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో భారతీయ సంగీతానికి ఎల్లలు లేవని చాటిచెప్పారు. 14 భాషల్లో 10 వేల పాటలు పాడిన గంధర్వ గాయిని వాణీ జయరాం.. ''పద్మభూషణ్'' సహా 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డులు, రివార్డులు ఆమె ప్రతిభకు తార్కాణం. పద్మభూషణ్ అందుకోకుండానే కనుమరుగు కావడం బాధాకరం. వాణీ జయరాం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి అని హిందూపూర్ శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ

     పద్మ అవార్డు స్వీకరించకుండానే కన్నుమూయడం

    పద్మ అవార్డు స్వీకరించకుండానే కన్నుమూయడం


    ప్రముఖ గాయని శ్రీమతి వాణీ జయరాం గారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మన తెలుగు భాషతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శ్రీమతి వాణీ జయరాం గారు ఆలపించిన గీతాలు శ్రోతలను అమితంగా మెప్పించాయి. శంకరాభరణంలో ఆలపించిన పాటలను ఇప్పటికీ మరచిపోలేం. అలాగే పూజ, సీతాకోకచిలుక, స్వాతి కిరణం లాంటి చిత్రాల్లో గీతాలు శ్రీమతి వాణీ జయరాం గారి గాన ప్రతిభను తెలియచేస్తాయి. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన శ్రీ వాణీ జయరాం గారు ఆ పురస్కారం స్వీకరించకుండానే కన్నుమూయడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

    ఇక లేరంటే నమ్మలేకపోతున్నా

    ఇక లేరంటే నమ్మలేకపోతున్నా


    లెజెండరీ సింగర్ వాణి జయరాం అమ్మ ఇక లేరనే చేదు నిజాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అమ్మా మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. నా సంగీత దర్శకత్వంలో త్వరలో రిలీజ్ కానున్న మలై పాటల రికార్డింగ్ సందర్భంగా ఆగస్టులో కలిశాను. ఈ రోజు ఆమె లేదనే విషయం తెలిసి నమ్మలేకపోతున్నాను అని మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ట్వీట్ చేశారు.

    గొప్ప గాయనిని కోల్పోయాం

    గొప్ప గాయనిని కోల్పోయాం


    ప్రముఖ గాయని ఇకలేరనే విషయం చాలా బాధాకరం. గొప్ప గాయనిని కోల్పోయాం. పద్మభూషణ్ అవార్డు అందుకోకుండానే ఈ లోకం నుంచి వెళ్లిపోవడం బాధాకరం. 5 దశాబ్దాలకుపైగా తన గాన మాధ్యుర్యంతో అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.

    భాష ఏదైనా గాన మాధుర్యంతో


    భాష ఏదైనా తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులకు, సినీ ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని అందించిన గాయని వాణీ జయరాం అమ్మ ఇకలేరు, ఆమె గొంతు శాశ్వతంగా మూగబోయిందని తెలిసి చింతిస్తూ వారి మృతికి ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాను అని ఏపీ మంత్రి, సినీ నటి రోజా ట్వీట్ చేశారు.

    English summary
    Pawan Kalyan, Balakrishna condolance to Singer Vani Jairam's death. Music Director Imman tweeted that, Can’t accept the hard hitting reality that Legendary Singer Vani Jairam Amma is no more. We miss you Amma. Met her and recorded for my upcoming film “Malai” last August. And I’m shocked to know that she’s no more today. My prayers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X