25 ఏళ్ల తర్వాత పవన్ రూల్స్ బ్రేక్.. ఖుషీ తర్వాత ఓజీ కోసమే..

సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. పవన్ రాజకీయాల్లోకి వెళ్లి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కానున్న రెండో మూవీ ఇదే. సెప్టెంబర్ 25న ఓజీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాలు ఓజీ ఫీవర్‌లో మునిగిపోయాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ చిత్రం దుమ్మురేపుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఓజీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.

ఓజీ సినిమా బడ్జెట్ ఎంత?
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్‌హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

Pawan Kalyan came to the recording studio for OG after Kushi SS Thaman

సెప్టెంబర్ 25న ఓజీ
సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల అఖండ 2 కూడా తొలుత అదే రోజున వస్తుందని డేట్ అనౌన్స్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఓజీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సోలోగా రిలీజ్ కానుంది. ఓజీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికాలో ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ బుకింగ్‌లో 1 మిలియన్ క్రాస్ చేసిన ఓజీ.. 2 మిలియన్ల దిశగా అడుగులు వేస్తోంది. రిలీజ్ డేట్‌కు ఇంకా సమయం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మ్యూజిక్‌తో మోత
ఓజీలో తమన్ మ్యూజిక్‌పై ఇప్పుడు అందరి చూపు పడింది. తొలుత ఓజెస్ గంభీరతో పవన్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత సువ్వి సువ్వి అనే మెలోడీ సాంగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అనంతరం గన్స్ అండ్ రోజెస్, హంగ్రీ చీతా, ట్రాన్స్ ఆఫ్ ఓమి అంటూ సాగే పాటలతో పవన్ కళ్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చారు. ఓజీ కోసం జపాన్ నుంచి ప్రత్యేకంగా కోటో అనే వాయిద్య పరికరాన్ని ఉపయోగించాడు థమన్. లండన్‌లోని స్టూడియోలో దీని కోసం దాదాపు 117 మంది సంగీత కళాకారులు పనిచేస్తున్నట్లు ఇటీవల థమన్ తెలిపారు.

ఖుషి తర్వాత ఓజీ కోసమే
ఓజీలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఓ పాట పాడారు. అదే వాషియో వాషి. జపనీస్ భాషలో సాగే ఆ పాటలో పవన్ కళ్యాణ్ ఏదో డైలాగ్స్ చెబుతున్నట్లుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్టూడియోలో పాటపడిన ఫోటోలు.. సుజిత్, తమన్‌లతో దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సంఘటన గురించి తమన్.. ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖుషి తర్వాత ఓజీ కోసమే రికార్డింగ్ థియేటర్స్‌కు వచ్చారని తెలిపారు. ఆయన ఆల్రెడీ సినిమా చూశారని చాలా హ్యాపీగా ఉన్నారని.. వాషి వాషి సాంగ్ రికార్డింగ్‌కి వచ్చినప్పుడు హుడీ వేసుకుంటారా అని మేం అడిగాం. దాంతో వెంటనే హుడీలను తెప్పించి పవన్ కళ్యాణ్ వేసుకున్నారని తమన్ చెప్పారు. ఇదే వేదికపై హీరోయిన్ ప్రియాంక మోహన్ నాకు కూడా హుడీ కావాలని అడగ్గా.. అప్పటికప్పుడే ఆమెకు హుడీని బహుకరించారు తమన్.

More from Filmibeat

Read more about: pawan kalyan og ss thaman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X