Jamuna సత్యభామగా వెండితెరపై అద్బుతం.. ఎంపీగా ప్రజాసేవలో.. పవన్ కల్యాణ్ సంతాపం
ప్రముఖ నటి, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో విశేషంగా రాణించి.. సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్న జమున ఇకలేరు. వృద్దాప్య సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న ఆమె జనవరి 27న కన్నుమూశారు. ఆమె మరణవార్తతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు అంటూ సంతాపం తెలియజేస్తున్నారు. జమునతో ఉన్న అనుబంధాన్ని పంచుకొంటున్నారు. ఈ విషాద సమయంలో పవన్ కల్యాణ్ సంతాపాన్ని తెలియజేస్తూ..
ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు.

ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు.
జమున చిన్నతనంలో డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటన పరంగా శిష్యరికం చేశారు. తల్లి నుంచి సంగీతం నేర్చుకొన్నారు. మాభూమి నాటకంలో ఆమె ప్రదర్శనను చూసి పుట్టిల్లు అనే చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. దాంతో ఆమె సినీ ప్రవేశం జరిగింది. అప్పటి నుంచి తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించారు.

తన 13వ ఏటనే పుట్టిల్లుతో కెరీర్ ప్రారంభించిన జమున.. ఆ తర్వాత నిరుపేదలు, వద్దంటే డబ్బు. దొంగ రాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, సతి అనసూయ, ఇల్లరికం, అప్పు చేసి పప్పుకూడు. మూగ మనుషులు, రాముడు భీముడు, దొరికితే దొంగలు. ఆమె నటించిన చివరి చిత్రం బాహుబలి.


Click it and Unblock the Notifications











