తమన్ దెబ్బకి చస్తే.. బాధ్యత ఎవరిది? థియేటర్ల వద్ద అంబులెన్స్‌లా?

సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఓజీ.. విడుదలకు నెల రోజుల ముందు నుంచే తన ప్రభావం చూపించింది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఓవర్సీస్ కలెక్షన్స్‌తో ఓజీ మేనియా ఆకాశాన్ని తాకింది. విడుదలకు ముందు రోజు రాత్రే వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్ పడ్డాయి. టికెట్ రేట్ ఎంతైనా కొనేందుకు అభిమానులు క్యూకట్టారు. సెప్టెంబర్ 25న పూర్తి స్థాయిలో సినిమా రిలీజ్ కావడంతో థియేటర్స్‌లో అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతున్నారు.

ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్‌ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Pawan Kalyan Fans enjoy SS Thaman s Blasting BGM for OG Movie

ఓజీకి నేను హీరో కాదు
ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాకు అసలు హీరోని నేను కాదని తమన్, సుజీత్‌లే హీరోలని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తన మెస్మరైజింగ్ మ్యూజిక్‌తో ఓజీ పాటలు, బీజీఎంతో ఓజీపై అంచనాలు పెంచారు తమన్. ఈ సినిమాపై ఈ స్థాయిలో హైప్ క్రియేట్ కావడానికి కారణం ఖచ్చితంగా తమనే అని అందరూ అంగీకరించాల్సిందే. సినిమా రిలీజ్ అయ్యాక తన సంగీతంతో ప్రేక్షకులకు థియేటర్‌లో పూనకాలు తెప్పించడంతో పాటు వారిని సీటులో కుర్చోనివ్వలేదు. మాంచి బీజీఎంతో సినిమాను ఎక్కడో కూర్చోబెట్టాడు తమన్. ఓజస్ గంభీర, హంగ్రి చీతా వంటి మాస్ బీట్స్‌కు తోడు సువ్వి సువ్వి అనే మెలోడీతోనూ ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా సాగుతుంది అన్నప్పుడల్లా తమన్ బీజీఎం ఆ సీన్‌ని లేపింది.

థియేటర్‌ ఓనర్లలో గుబులు
సాధారణంగా తమన్ ఎవరైనా మాస్ హీరో సినిమాకు మ్యూజిక్ అందించాడంటే అభిమానులు, థియేటర్ యాజమాన్యాలు వణికిపోతున్నాయి. గతంలో నందమూరి బాలకృష్ణతో తమన్ చేసిన డాకు మహారాజ్, అఖండ సినిమాల సమయంలో థియేటర్ల బాక్స్‌లు నిజంగానే బద్ధలయ్యాయి. ఈ పరిణామాలతో కాస్త మా మీద దయ చూపాలని, అసలే సినిమాల రిలీజ్‌లు లేక నష్టాల్లో నడుస్తున్నప్పుడు మీరు బాక్స్‌లు బద్ధలయ్యే మ్యూజిక్‌తో ఇంకా నష్టాలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారంటే తమన్ బీజీఎంను అర్ధం చేసుకోవచ్చు.

అంబులెన్స్‌లు పెట్టండి సార్
తాజాగా ఓజీ రిలీజ్ సందర్భంగా తమన్‌పై ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు చూసొచ్చిన అభిమానులను మీడియా ప్రతినిధులు.. ఓజీ ఎలా ఉందని రివ్యూలు అడిగారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కోలా రివ్యూలు ఇచ్చారు. అందరూ తమన్ మ్యూజిక్‌, బీజీఎంను మెచ్చుకున్నారు. తమన్ కారణంగా సినిమా ఓ రేంజ్‌లో ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ఓ రేజ్ తమన్.. సచ్చిపోతే ఎవడ్రా రెస్పాన్సిబులిటీయా.. అయ్యా ప్రభుత్వానికి ఇదే మా విన్నపం. దయచేసి అంబులెన్స్‌లు పెట్టండి అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: pawan kalyan ss thaman og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X