OGకి హిందీ మార్కెట్ లో దెబ్బ.. ఆ ఒప్పందం వల్లనే పవర్ స్టార్ సినిమాకు షాక్
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ OG. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పవర్ స్టార్ ను తన అభిమానులకు సుజీత్ ఏ రేంజ్ లో చూపించాలో అంతుకు మించి చూపించారు. అభిమానులే సుజీత్ డైరెక్షన్ కు ఫిదా అవుతూ ఉన్నారు. మరోవైపు నార్మల్ ఆడియెన్స్ కూడా OG చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో ఫుల్ సాటిస్ఫై అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ నుంచి చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా హరిహర వీరమల్లు : పార్ట్ 1 చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైంది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ రీజినల్ ఫిల్మ్స్ లోనే నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో THEY CALL HIM OG చిత్రంతో పాన్ ఇండియా ఫిల్మ్ గా పవన్ కళ్యాణ్ ఇండియాను షేక్ చేస్తారని అంతా భావించారు.

OG చిత్రంతో పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ తెలుస్తుందని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే OGని కూడా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని భాషల్లో OG చిత్రం గ్రాండ్ గా విడుదలై ప్రస్తుతం అంతటా పవన్ కళ్యాణ్ మ్యానియానే కనిపిస్తోంది. ఇతర భాషలల్లోనూ థియేటర్లలో సందడి నెలకొంది. కానీ హిందీ బెల్ట్ లో మాత్రం నిరాశ మిగిలింది.
పవన్ కళ్యాణ్ OG చిత్రం పాన్ ఇండియా గ్లోరీని కాస్తా మిస్ అయినట్టుగా కనిపిస్తున్నది. అందుకు కారణం హిందీ రిలీజ్ విషయంలో మేకర్స్ కు ఏర్పడ్డ అడ్డంకులని సినీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ లోనూ ఓజీ విడుదలైనా కేవలం చిన్న థియేటర్లకే పరిమితం అయ్యింది. మల్టీప్లెక్స్ చైన్స్ ను మిస్ చేసుకుంది. అందుకు రీజన్ ఈ సినిమాకు రిలీజ్ కు ముందే OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం జరగడం. థియేట్రికల్ రిలీజ్ విషయంలో కేవలం 4 వారాలు మాత్రమే ఒప్పందం చేసుకున్నారు.
ఆ చిత్రం సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమా నెల రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ జరగబోతోంది. తెలుగుతో పాటు ఇండియాలోని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే నార్త్ థియేట్రికల్ రిలీజ్ రూల్స్ ప్రకారం.. ఏ సినిమా విడుదలైన 8 వారాల పాటు ఓటీటీలోకి రాకూడదు. కానీ ఓజీ 4 వారాలకే స్ట్రీమింగ్ కాబోతుండటంతో సినిమాను నార్త్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అవకాశం లేకపోయిందని తెలుపుతున్నారు. ఇక ఇటీవల కూలీ చిత్రం హిందీలో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను 8 వారాలకు అమ్ముకుంది. దాంతో అక్కడ భారీ ఎత్తున మల్టీప్లెక్స్ ల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూల్ రాబట్టింది. OG విషయంలోనూ అదే జరిగి ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఏంటో నార్త్ లో బొమ్మ కనిపించేదని సినీ పండితులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











