మిరాయ్‌ కలెక్షన్లపై ఓజీ దెబ్బ.. పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన నిర్మాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం THEY CALL HIM OG. ఈ చిత్రం రేపు అనగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈరోజు అంటే సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో OG మూవీ వైబ్ నే అంతటా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

అయితే, OG సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కాగా, ఏపీ తెలంగాణలో ఎక్కువ థియేటర్లలో OG సినిమాను విడుదల చేయసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఇటీవల విడుదలైన సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ మిరాయ్ : సూపర్ యోధా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఎక్కువ శాతం థియేటర్లలో ఇప్పుడు మిరాయ్ చిత్రం, మరోవైపు లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, ఇతర భాషల చిత్రాలు ఆడుతున్నాయి.

Pawan Kalyan OG Movie Take Mirai Theatres In Ap TG

కాగా, ఓజీ చిత్రం విడుదలను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఎక్కువ స్కీన్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో మిరాయ్ మూవీ మేకర్స్ తమ థియేటర్లను పవన్ కళ్యాణ్ OGకి ఇవ్వడం విశేషంగా మారింది. సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 25న రెండ్రోజులు బుధవారం, గురువారం మిరాయ్ సినిమా ఆడాల్సిన థియేటర్లను OG చిత్రానికి మేకర్స్ కేటాయించారు. శుక్రవారం నుంచి యథావిధిగా మళ్లీ మిరాయ్ ను ఆ థియేటర్లలో ప్రదరించబోతున్నారు.

ఇక వరల్డ్ వైడ్‌గా OG చిత్రం దాదాపుగా 4700 వరకు ప్రీమియర్స్ షో ప్రదర్శితం కాబోతుండటం విశేషం. యూఎస్ లో 174 లోకేషన్లలో 631 షోలో ప్రదర్శితం కానుంది. ఇలా OG సినిమాను భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఓజీ చిత్రానికి ప్రస్తుతం భారీ హైప్ నెలకొంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహించుకున్నా కూడా సినిమాపై తారాస్థాయి అంచనాలు నెలకున్నాయి. ఇక సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంటే మున్ముందు రికార్డులను కొల్లగొడుతుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందించారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో RRR చిత్రం వచ్చి భారీ సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుండటం విశేషం. ఈ చిత్రంలో టాప్ స్టార్స్, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల వరకు అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og movie mirai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X