ఓజీ ప్రీక్వెల్ చేస్తున్నా.. ఫ్యాన్ వార్‌తో సినిమాను చంపొద్దు .. పవన్ కళ్యాణ్

సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలై సంచలన విజయం సాధించింది. వారం తిరిగేసరికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా ఓజీ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెల్లచొక్కా, జుబ్బా వేసుకుని వద్దామనుకుంటే లేదు సార్.. మీరు బ్లాక్ డ్రెస్‌లో కళ్లజోడు పెట్టుకుని రావాలని చెప్పారు.

మొన్న కటానా పట్టుకొచ్చాను, పైగా వర్షం, గుంపు నన్నంతా ఆడుకున్నారు.. అయినా వదిలేశాను. ఈరోజు కళ్లజోడు పెట్టుకుని గన్‌తో రావాలని అన్నారని.. చంపేస్తానని చెప్పానని పవన్ తెలిపారు. నాకు గన్స్ మీదు వీక్‌నెస్‌తో ఆడుకుంటున్నారని, ప్రతి మనిషికీ ఓ వీక్‌నెస్ ఉంటుంది. మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో నేను మెంబర్‌ని, వాళ్లు తీసుకొచ్చిన వెపన్ రష్యా వాళ్లు తయారు చేశారు, రెండో ప్రపంచ యుద్ధంలో బాగా ప్రభావం చూపించింది. దీంతో మీరు రౌడీలు, గుండాలను కాలుస్తారంటే నాకు చాలా ఆనందం వేసిందన్నారు పవన్ కళ్యాణ్. నా అభిమానుల కోసం ఇలాంటి గన్‌ను పట్టుకుంటున్నానని ఫోటోకి ఫోజులిచ్చారు పవర్‌స్టార్.

Pawan Kalyan Powerfull speech at OG Success Celebrations

నా అభిమానులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా సుజీత్ గారు తెరపై చూపించారు. సుజీత్ నన్ను కలిసి 5 నిమిషాల స్టోరీ చెప్పగా.. అందులో సమురాయ్ కత్తి, జపనీస్ డ్రెస్, గ్యాంగ్‌స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయ్.. పెద్ద డైలాగ్స్ కూడా ఏం లేవు. ఇరవై, 21 సంవత్సరాల వయసులో నా మైండ్ అంతా ఎక్స్‌ప్లోజీవ్‌గా ఉండేది. ఎవరితోనైనా మాట్లాడదామంటే నువ్వే కొత్త, నీ ఐడీయాలు కొత్త, నువ్వేం పనిచేస్తావని మా ఇంట్లో ఎగతాళి చేసేవారు. నువ్వే యాక్ట్ చేసుకుని, నువ్వే తీసుకోమ్మని చెప్పేవారు.. నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. న్యూయార్క్‌లో ఓ ఫిల్మ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఓ షార్ట్ ఫిలిం చేయాల్సి వచ్చింది.

జానీ గన్ అని పెట్టగానే.. అది ఆల్రెడీ ఫెయిలైంది, మళ్లీ తేడాపడితే.. భవిష్యత్తు మొత్తం మూసేస్తున్నావనే భయం ఉండేది. ఒక్కోసారి నమ్మి చేసేయాల్సిందే.. సినిమా సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి నేను భయపడను. రీసెంట్ హరిహర వీరమల్లుకు కూడా అంతే. ఎప్పుడూ బెస్ట్ ఇస్తాను.. ఈ సినిమాలో సింగర్స్, లిరిక్ రైటర్స్, సింగర్స్ ఉన్నారని సినిమా సక్సెస్ కావాలనే కోరుకుంటా. నేను, విశ్వ రెండు దశాబ్ధాల క్రితం చిన్నగా ప్రారంభమయ్యాం, ఏ సక్సెస్‌కైనా టీమ్ వర్క్ అనేది ముఖ్యం. నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యింది టీమ్ వర్క్ లేకనే.. అన్ని సినిమాలకి ఎంత కష్టపడ్డానో, దీనికి కూడా అంతే కష్టపడ్డా. నా మీద సుజీత్ అంత బరువు కూడా వేయలేదు, మిగతా సినిమాలకు టన్నులకొద్దీ బరువు మీదేసుకుని చేస్తే రిజల్ట్ పిసరంత కనిపించేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మణిశర్మ దగ్గరి నుంచి తమన్ పరిచయమయ్యాడు. ఓజీకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అందరు దర్శకులు పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి ఎలివేషన్ ఇవ్వాలని చూస్తారు, కానీ సుజీత్ మాత్రం నాకు ఓ నాన్న కథ చెప్పాడు. అందరూ ఓజీలో యాక్షన్‌ని చూశారు కానీ.. ఓ భార్యాభర్తల కథ, ఓ చిన్న కుటుంబం కథని ఎవరూ చూడటం లేదని కానీ డ్రామాని అద్భుతంగా చెప్పిన సుజీత్ లాంటి గొప్ప దర్శకుడిని చూశానని పవన్ చెప్పారు.

ఖుషి సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన టీమ్.. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చేదా? అని విడిపోయారు. జానీ స్టార్ట్ చేయకముందే టీమ్ స్పిరిట్ లేదని నాకు తెలిసిపోతోంది. ఓ డైరెక్టర్, రైటర్ సినిమాను ముందుకు తీసుకెళ్లెటప్పుడు ప్రతి ఒక్కరూ పక్కనే ఉండాలి. డైరెక్టర్ విజన్‌ని మిగతావాళ్లు వెనక్కి లాగకుండా ఉంటే చాలు, జానీ విషయంలో ఆ లోటు, నిస్సహాయత ఉండిపోయింది. జానీ ఓ స్టాండర్డ్ సినిమా కాదు, రెగ్యులర్ కమర్షియల్ సినిమా, ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్రామా, డిజైన్ ఉన్నాయి.. కానీ ఎక్కడా ఒక ఫార్మాట్‌లో లేదు. కానీ ఓజీకి వచ్చేసరికి వీటన్నింటినీ కథగా చెప్పడంలో సుజీత్ సక్సెస్ అయ్యాడని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

నాలో యాక్టర్ కంటే టెక్నీషియనే అలర్ట్‌గా ఉంటాడు. ఈ సినిమాను ఫస్ట్ జానీ అని రాశానని చెప్పాడని, కానీ అలా చెప్పుంటే ఈ సినిమా చేసేవాడిని కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా జీవితంలో ఇప్పటికీ ఓ గిల్ట్ ఉండేది.. ఓజీని కొంచెం తపనపడి చేసి ఉండాల్సిందని ఆ లోటుని సుజీత్ తీర్చాడు. కత్తి పట్టుకుని ఆడియో ఫంక్షన్‌కి రావడం నిజ జీవితంలో చాలా ఎబ్బెట్టుగా ఉంటుందని, కానీ హరిహర వీరమల్లు మూవీ కోసం నిధి అగర్వాల్ సింగిల్ హ్యాండ్‌తో ప్రమోషన్స్ చేయడం చూసి ముచ్చటేసిందన్నారు. ఓజీ సెట్‌కి నేను ఎప్పుడు వచ్చినా ఎవరికీ నిద్రాహారాలు లేవు, వాళ్లు నన్ను అడిగింది బ్లాక్ డ్రెస్ వేసుకుని కటానా పట్టుకుంటావా? అని మాత్రమే. సినిమా హిట్, ఫ్లాప్‌ని నేను పట్టించుకోను.. కానీ వాళ్ల కోసం కటానా పట్టుకున్నా, ఇందాక తుపాకీ కూడా పట్టుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

తమన్ చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి, తనే ఇంటికి పెద్ద దిక్కయి, ఈ సినిమా ఓ తండ్రి కథ అని తెలియగానే.. తమన్ వాళ్ల నాన్నగారికి ఈ సినిమాను అంకితం ఇచ్చాడా అనిపించింది. ప్రకాశ్‌రాజ్ గారుంటే మీరు యాక్ట్ చేస్తారా అని అడిగారు.. దానికి అస్సలు నాకు ఇబ్బంది లేదని చెప్పా. ప్రకాష్‌రాజ్ గారు ఓ బ్రిలియంట్ యాక్టర్.. ఇతర విషయాలు బయట మాట్లాడుకుందామని చెప్పా. కన్మణి క్యారెక్టర్‌కు ప్రియాంక మోహన్ గారు న్యాయం చేశారు. రఘువరన్ తర్వాత అర్జున్ దాస్ నాకు ఇష్టమైన చాలా ఇష్టమన్నారు.

ఓజీ సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ ఏదైనా సరే నీతో నేను చేస్తానని సుజీత్‌కి మాటిచ్చా. అయితే చాలా షరతులకు లోబడి ఆ సినిమా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ మీద చాలా విసిగిపోయా.. సినిమా ఫెయిలైతే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా బాగున్నప్పుడు అందరూ వస్తారు, కానీ సినిమా బాగోన్నప్పుడు మన వెనుక ఎవరు నిలబడతారో.. వాళ్లే మనోళ్లు. నా అభిమానుల బాధ, కసి కలిపి తమన్, సుజీత్‌ల రూపంలో వచ్చారు. ప్రకాశ్ రాజ్ అంటే నాకు ఇష్టం లేకపోయినా, సినిమా ఆయన మీద కోపం లేకుండా చేస్తుంది. మీ అందరి కోసం ఓజీ యూనివర్స్‌లో భాగమవుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీ అందరి ఆకలి తీర్చలేకపోయాననే బాధ ఉండేది, కానీ నేను సినిమా కంటే పెద్దది చేస్తున్నాను, పాలిటిక్స్ టఫ్ జాబ్.

రియల్ లైఫ్‌లో తల కూడా ఎగిరిపోవచ్చు.. ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఫ్యాన్ వార్స్ ఆపేయాలని, సినిమాను చంపొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. సినిమాను చూడటం మానేసి, అందరూ రివ్యూలు ఇస్తున్నారు.. ఈ కల్చర్ పోవాలి. అత్తారింటికి దారేది సినిమాను అంత కష్టపడి తీస్తే.. నెట్‌లో రిలీజైతే మా బాధ ఎవరికీ చెప్పుకోవాలి. 40 కోట్లకు వడ్డీలు కట్టాలి.. కాటమరాయుడు దాకా కడుతూనే ఉన్నా, చూడటానికి వెలుగు, జిలుగులు ఉంటాయి కానీ మా గుండెల్లో రోదన ఎవ్వరికీ తెలియదు. సోషల్ మీడియా, యూట్యూబర్లు సినిమాను చంపేస్తున్నారు, మా అందరి ఉసురు కొడుతుంది. హరిహర వీరమల్లు బాధ్యత ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నా.. ఇన్ని ప్రతికూల పరిస్ధితుల మధ్య ఓజీ చిత్రం నాకు బలాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X