Pawan Kalyan Rana Movie.. సంక్రాంతి బరిలో పవర్ స్టార్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి బరిలోకి పవన్ కల్యాణ్ దిగేందుకు సిద్దమయ్యారు. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న అయప్పనుమ్ కోషియం సినిమా రీమేక్‌ను సంకాంత్రి పండుగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తాజాగా అధికారికంగా అయ్యప్పనమ్ కోషియం సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే ఈ సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Pawan Kalyan Rana Movie

తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి చిత్రం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఈ సినిమా షూటింగును త్వరగా పూర్తి చేస్తూ.. ప్రొడక్షన్ పనులను కూడా ఏకాకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వీడియోను సోమవారం ఆగస్టు 2వ తేదీన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కల్యాణ్‌తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మ్యూజిక్ సిట్టింగులో పాల్గొన్నారు. సంగీత దర్శకుడికి సలహాలు ఇస్తూ త్రివిక్రమ్ కనిపించారు. పక్కనే పవన్ కల్యాణ్ సంభాషణల్లో పాలు పంచుకొన్నారు.

ఇక ఇంకా పేరు పెట్టని చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ పాట పాడబోతున్నారనే విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను పవర్ స్టార్ పాడుతున్నట్టు సోషల్ మీడియాలో ధృవీకరిస్తున్నారు.

సెకండ్ లాక్‌డౌన్ తర్వాత పవన్ కల్యాణ్ షూటింగుకు హాజరు కాగా ఆయన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాస్ అవతారంలో పవన్ కల్యాణ్ ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. తాజాగా రానా, పవన్, నిత్యమీనన్‌పై చిత్రీకరించిన ఈ సీన్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, ఐశ్వర్య రాజేశ్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: ఎస్ థమన్
డీవోపి: ప్రసాద్ మూరేళ్ల
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్: సంక్రాంతి 2022

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X