12 ఏండ్ల కసి ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కళ్యాణ్ మూవీపై హైప్స్ పెంచేశారుగా..
Ustaad Bhagat Singh: ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముందు నుంచి ఈ సినిమాకు ఉన్న హైప్, పవన్ కళ్యాణ్ స్టిల్స్, సినిమాలో పవన్ లుక్స్, సాంగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేశాయి. ఇలా అని కలసి రాయండి 'ఓజీ'మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ తరువాత పవన్ ఫ్యాన్స్ కన్ను 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పడింది. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఓ భారీ అప్టేడ్ రావడంతో పవన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ వీలు బట్టి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ మళ్లీ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఆయన పాత్రలో గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్‌బి శ్రీరామ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ, నీతా లుల్లా కాస్ట్యూమ్స్, ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ వంటి టెక్నికల్ టీమ్ సపోర్ట్ సినిమాకు మరో లెవెల్ లుక్ తీసుకువచ్చిందని యూనిట్ చెబుతోంది.
తాజా మైత్రీ మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్స్ క్రియేట్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి దీపావళికి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని మీడియా ప్రశ్నించగా.. నిర్మాత నవీన్ యెర్నేని (Naveen Yerneni) మాట్లాడుతూ.. 'దీపావళికి ఎలాంటి అప్డేట్స్ లేవు కానీ అతి త్వరలో మూవీ అప్డేట్స్ వస్తాయి' అంటూ బదులిచ్చారు. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాపై హైబ్స్ క్రియేట్ అయ్యేలా.. ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ను వెల్లడించారు.
'ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కు సంబంధించిన ట్రైలర్స్, టీజర్, పోస్టర్స్ మూవీ అప్డేట్స్ పై హరీష్ శంకర్ చాలా కష్టపడుతున్నారు. హరి శంకర్ 12 ఏళ్ల నుండి ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఆ 12 ఏళ్ల కసి వస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు మొత్తం ప్రేక్షకులకీ ఇది మాస్ ఫీస్ట్ అవుతుంది'అని నవీన్ యెర్నేని హామీ ఇచ్చారు. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ హైప్స్ క్రియేట్ చేశారు.


Click it and Unblock the Notifications











