Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
దటీజ్ అకీరా నందన్ క్రేజ్ .. మెగా హీరోల కంటే హై రేంజ్ లో.. వ్వాటే సీన్!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రస్తుతం స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కొంతమంది నట వారసులు సిద్ధంగా అయితే ఉన్నారు. అయితే ఎక్కువమంది ప్రేక్షకుల ఫోకస్ మాత్రం పవన్కళ్యాణ్ పెద్దకుమారుడు అకీరా నందన్ పైనే ఉంది. అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం అకీరాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒక విధంగా మెగా హీరోలకు కంటే ఎక్కువగానే ప్రేక్షకులు అతని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో వివరాల్లోకి వెళితే..

అభిమానులు భక్తులుగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక విధంగా తన సినిమాల కంటే కూడా పర్సనల్ లైఫ్ తోనే అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నాడు. అతను ఉండే సింప్లిసిటీ అలాగే మంచితనం నలుగురికి సహాయం చేయాలనుకునే గుణం చూసి అభిమానులు భక్తులుగా మారిపోయారు. ఒక విధంగా వెండితెరపై పవన్ కళ్యాణ్ కు తనకు తానే పోటీ అనే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాడు.

అకీరా నందన్ ఎంట్రీ ఇస్తే..
అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడితే చూడాలి అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతను ఎంట్రీ ఇస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని వాతావరణం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే అతని కటౌట్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే అకీరానందన్ కంటే మెగా ఫ్యామిలీలో ఎవరు అంత హైట్ లేరు.

ఎంట్రీ ఉంటుంది అని..
ఆ మధ్య కాలంలో అకీరానందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అగ్ర దర్శకులు కూడా అతని కోసం సంప్రదింపులు జరుపుతున్నారని ఒక యూత్ఫుల్ మాస్ కథ తోనే అఖిల్ ఎంట్రీ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని రీసెంట్ గా అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా అతని తల్లి రేణుదేశాయ్ క్లారిటీ అయితే ఇచ్చారు.

మంచి భవిష్యత్తు
అఖిల్ నందన్ కు సంబంధించిన ఎలాంటి ఫోటో సోషల్ మీడియాలో వచ్చినా కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అతను కూడా తండ్రి తరహాలోనే చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతాడు అని చాలాసార్లు రుజువైంది. రీసెంట్ గా అకీరా 18 ఏళ్ళ వయస్సు లోకి రావడంతో అతను వీలైనంత త్వరగా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెబుతున్నారు.

అప్పుడే అకీరా కటౌట్
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అకిరా నందన్ క్రేజ్ కు సంబంధించిన ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది. ఆచార్య సినిమా విడుదల అవుతున్న సందర్భంగా మెగా అభిమానులు థియేటర్ల వద్ద ప్రత్యేకంగా కొన్ని కటౌట్స్ ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల అకీరా నందన్ కటౌట్స్ కూడా కనిపించడం ఆశ్చర్యాన్ని కలుగ చేసింది.

కటౌట్ వైరల్..
అకిరా
నందన్
కటౌట్
కి
ఉన్న
ప్రత్యేకత
ఏమిటి
అంటే..
మెగాస్టార్
చిరంజీవి
రామ్
చరణ్
అలాగే
పవన్
కళ్యాణ్
కు
సంబంధించిన
కటౌట్
కంటే
ఎక్కువగా
దండలు
అతని
కటౌట్
కు
ఉండడం
విశేషం.
ఇప్పుడే
అకీరా
నందన్
ఈ
రేంజ్
లో
క్రేజ్
అందుకుంటున్నాడు
అంటే
అతను
హీరోగా
ఎంట్రీ
ఇస్తే
మాత్రం
మామూలుగా
ఉండదు
అని
అభిమానులు
అభిప్రాయాన్ని
వ్యక్తం
చేస్తున్నారు.
మరి
అతను
తెలుగుతెరపై
ఎప్పుడు
దర్శనమిస్తాడో
చూడాలి.