For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జిమ్‌లో వర్కౌట్స్ స్టార్ట్ చేసిన అకిరా నందన్.. కర్రసాము విన్యాసంతో మైండ్ బ్లోయింగ్

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యువతలో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అకిరా నందన్ కు సైతం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సినీ వారసుల్లో ఎంట్రీకి సిద్ధంగా ఉన్న వారిలో అకిరా ఒకరు. మధ్యలోనే రాకపోవచ్చని టాక్ అయితే వచ్చింది. అయితే అతని ఎంట్రీకి కొన్నేళ్ల సమయం పట్టవచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి. ఇక రీసెంట్ గా అకిరా నందన్ జిమ్ లో కసరత్తులు కూడా చేసినట్లు ఒక వీడియో ద్వారా అర్ధమయ్యింది.

  ఒక్క ఫొటో విడుదలైనా కూడా

  ఒక్క ఫొటో విడుదలైనా కూడా

  అకిరా నందన్ కు సంబంధించిన ఒక్క ఫొటో విడుదలైనా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎక్కువగా తల్లి రేణు దేశాయ్ కొడుకుకి సంబంధించిన ఫొటోలను వీడియోలను రిలీజ్ చేస్తుంటారు. ఇక అకిరా అప్పుడప్పుడు తండ్రి పవన్ కళ్యాణ్ తో కూడా ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. ఆ మధ్య వారు కలిసి మ్యూజిక్ క్లాస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.

  అందరికంటె ఎక్కువ హైట్

  అందరికంటె ఎక్కువ హైట్

  పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ పేరు వినగానే అభిమానుల్లో ఇప్పటికే ఒక వైబ్రేషన్ మొదలవుతోంది. మెగా అభిమానులైతే అతని ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు పదుల వయసులోకి రాకముందే అకిరా నందన్ తన హైట్ తో అందరికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అతని వయసు 17 ఏళ్ళు మాత్రమే. తన సోదరుడు వరుణ్ తేజ్ కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోయాడు.

  పవన్ కళ్యాణ్ తరహాలోనే..

  పవన్ కళ్యాణ్ తరహాలోనే..

  ఓ వైవు తండ్రి ప్రేమను మరోవైపు అమ్మ ఆప్యాయతను ఏ మాత్రం మిస్సవ్వకుండా వారితో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

  పవన్ కళ్యాణ్ సింపుల్ గా ఉండడానికి ఎలాగైతే ఇష్టపడతాడో అకిరా నందన్ కూడా అదే తరహాలో సింపుల్ లైఫ్ ను ఇష్టపడతాడు. అతనికి విలాసవంతమైన లైఫ్ అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదట. స్టైలిష్ గా కాకుండా సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు.

   హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా

  హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా

  ఇక అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది అతని ఛాయిస్ అంటూ ఇదివరకే రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే కొడుకుతో ఎప్పుడు కూడా సినిమాల గురించి మాట్లాడినట్లు తాను వినలేదని కూడా ఆమె అన్నారు. అయితే అభిమానులు మాత్రం అకిరా రావాల్సిందే అంటూ బలంగా కోరుకుంటున్నారు.

  కర్రసాము చేస్తూ..

  కర్రసాము చేస్తూ..

  ఇక రీసెంట్ గా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో అకిరా కర్రసాము చేస్తూ తండ్రి తరహాలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు టాక్ వస్తోంది. జిమ్ లో ఉన్నాడు అంటే వ్యాయామం కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే 18లోకి అడుగు పెట్టబోతున్న అకిరా వర్కౌట్స్ అనంతరం ఎలాంటి లుక్కుతో కనిపిస్తాడో చూడాలి.

  Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
  పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలు

  పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలు

  ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. నెక్స్ట్ రానా దగ్గుబాటితో కలిసి చేస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో రానున్న పవన్ అనంతరం హరిహర వీరమల్లుతో రానున్నాడు. హరీష్ శంకర్ తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మాస్ కమర్షియల్ సినిమాలను లైన్ లో పెట్టాడు.

  English summary
  Needless to say, fan star Pawan Kalyan has a special fan following. Similarly, his son Akira Nandan is also getting good craze. Even the release of a single photo of him goes viral on a range of social media. Recently, a few more photos came out and suddenly joined the trend list
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X