అఖిరా అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్టన్… ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan-Akira Nandan: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమాకైనా సైన్ చేస్తే ఆ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలపై ఫోకస్ చేయడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి కాన్సన్‌ట్రేషన్‌తో చేసిన తాజా మూవీ 'ఓజీ'తో ప్రేక్షకుల ముందు వచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా 'ఓజీ'. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ గురించి అఖిరా అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్టన్ అయ్యారంట. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటీ? ఇంతకీ పవన్ కళ్యాణ్ ను అఖిరా అడిగినా ప్రశ్న ఏంటీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- సుజిత్ (Sujeeth) కాంబోలో తెరకెక్కిన మూవీ 'ఓజీ' (OG).ఈ మూవీని డి.వి.వి. దానయ్య (DVV Danayya)నిర్మించిన 'ఓజీ' మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 'ఓజీ'లో పవన్ లుక్‌ నుండి స్టైల్ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించిన ఆయన, స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సన్నివేశంలో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్‌లో ఆయన చూపిన ఆటిట్యూడ్ ప్రత్యేకంగా నిలిచింది.

Pawan Kalyan Surprised by Akira Nandan s Question on OG Movie Climax

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ వరకు ఆయన ప్రెజెన్స్ ఎలా ఆడియన్స్‌ను హై చేసిందో చూసి ఫ్యాన్స్ ఉత్సాహంతో మునిగిపోయారు. ఇక బాక్సాఫీస్ వద్ద 'ఓజీ' కలెక్షన్స్ మరోసారి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంత ఉందో చాటి చెప్పాయి. రికార్డులు బద్దలు కొడుతూ ఈ చిత్రం ఇప్పటికే 343 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నంబర్ వన్ గా నిలచింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా 'ఓజీ'.పవన్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ కనిపించడం అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఈ క్రమంలోనే పవన్ కుమారుడు అఖిరా నందన్ అడిగిన ఒక ఆసక్తికరమైన డౌట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్‌కు రైట్ హ్యాండ్‌గా హరీష్ ఉత్తమన్ నటించారు. అయితే సినిమాలో అతని పాత్రను చంపేసిన విషయం అఖిరాకు కొంచెం క్లారిటీ ఇవ్వలేదట. దీంతో ఆయన తన తండ్రి పవన్‌ను ఆ విషయం గురించి ప్రశ్నించాడట. "హరీష్ ఉత్తమన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా చూపించారు. అలాంటి క్యారెక్టర్‌ను ఎందుకు చంపేశారు?" అని అఖిరా అడగడంతో పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు.

పవన్ మాటల్లో... "డైరెక్టర్ సుజీత్, హరీష్ ఉత్తమన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు. అలా చూపించినప్పుడు చివర్లో అతన్ని చంపేస్తేనే ఆ సీన్‌లో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అంతే కాకుండా హీరో పాత్రను ఎలివేట్ చేయడానికీ అది అవసరం. అందుకే దర్శకుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి పూర్తిగా సుజీత్‌నే బాధ్యత వహించాలి" అని చెప్పాడట. ఈ ఫన్నీ డౌట్ గురించి పవన్ కళ్యాణ్, 'ఓజీ' సక్సెస్ మీట్‌లో మాట్లాడారు. అయితే.. అఖిరా సినిమాల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్- అఖిరా మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X