Pawan Kalyan ప్రభాస్ దర్శకుడి డైరెక్షన్‌లో పవర్ స్టార్.. మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస చిత్రాలతో అభిమానులను ఆనందానికి గురిచేస్తున్నారు. అయితే ఇప్పటికే వరుసగా రెండు రీమేక్ చిత్రాల్లో నటించిన పవర్ స్టార్ ముచ్చట మూడోసారి మరో రీమేక్‌కు సిద్దమవుతున్నారు. గత రెండేళ్లలో హిందీ చిత్రం పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్, అలాగే మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియం ఆధారంగా భీమ్లా నాయక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలు కూడా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషంగా పేర్కొన్నవచ్చు. అయితే తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన థేరి చిత్రం రీమేక్‌కు పవన్ కల్యాన్ పచ్చ జెండా ఊపినట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
థేరి సినిమా విషయానికి వస్తే తమిళంలో భారీ విజయం సాధించింది. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ చేసి రిలీజ్ తెలుగులో పోలీసోడుగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది.

అయితే తమిళం చిత్రం థేరి రీమేక్‌గా రూపొందించే చిత్రంలో పవన్ కల్యాణ్ నటించాలని నిర్ణయం తీసుకొన్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తుండగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా గురించి ఏప్రిల్‌లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రాజకీయాలతోపాటు సినిమాల పరంగా పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











