For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tej కోసం రంగంలోకి మామలు.. మొన్న చిరు రేపు పవన్.. అంతా వారే!

  |

  మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన సినిమా ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు దృష్టిపెట్టారు. తమ మేనల్లుడు సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  హాస్పిటల్ లో

  హాస్పిటల్ లో

  మెగా పవర్ స్టార్ సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఇప్పుడు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ డిస్ లొకేట్ కావడంతో దానికి శస్త్రచికిత్స చేసి సరి చేశారు వైద్యులు.. అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడిందని ఇప్పటికే కృత్రిమ శ్వాస తీసుకోవడం లేదని ఆయన చాలా నార్మల్ గా ఉన్నారు అని చెబుతూ మరో రెండు మూడు ఈ రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తామని అపోలో హాస్పిటల్ వైద్యులు కూడా ప్రకటించారు. మరి ఇవాళ రేపట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  మేనల్లుడి కోసం

  మేనల్లుడి కోసం

  అయితే ఇదంతా ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. సాయిధరమ్ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాను ప్రస్థానం లాంటి గుర్తుండిపోయే సినిమాలకు దర్శకత్వం వహించిన దేవాకట్టా రూపొందించారు. పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.

  అయితే ఈ సినిమా ప్రమోషన్ కు సాయి ధరంతేజ్ స్వయంగా హాజరు కాలేక పోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను ఆయన ఇద్దరు మామయ్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

  ట్రైలర్ లాంచ్ చేసిన మెగాస్టార్

  ట్రైలర్ లాంచ్ చేసిన మెగాస్టార్

  ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ సినిమా ట్రైలర్ను ఆయన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది.

  మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామరక్ష అంటూ ఆయన ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది.. దేవా కట్టా మార్కెట్ డైలాగులు సాయిధరమ్ తేజ నోటి నుండి వెలువడిన అంటే సినిమా ఆసక్తికరంగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

  మేనల్లుడి కోసం రంగంలోకి

  మేనల్లుడి కోసం రంగంలోకి


  అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన మేనల్లుడి కోసం రంగంలోకి దిగుతారని అంటున్నారు ఫిలింనగర్ వర్గాల లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25 వ తేదీన హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

  హుటాహుటిన హాస్పిటల్ కి

  హుటాహుటిన హాస్పిటల్ కి


  నిజానికి అపోలో హాస్పిటల్ కు తరలించడానికి కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి హాస్పిటల్ కి రావడమే కాక వెంటనే సాయి ధరమ్ తేజ్ ని పరిశీలించి ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్లో వివరాలు అందించారు. అయితే సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు చెప్పే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోలేదని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించారు కూడా.

  సన్నిహిత సంబంధాలు

  సన్నిహిత సంబంధాలు


  నిజానికి పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ కూడా గతంలో అనేక సార్లు ప్రస్తావించారు కూడా, రీసెంట్ గా యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ వీడియోలో తాను బైక్ కొనుక్కున్న వెంటనే దాన్ని తీసుకెళ్లి పవన్ మామయ్యకు చూపించానని దానిని చూసిన ఆయన అడిగిన మొదటి ప్రశ్న హెల్మెట్ పెట్టుకున్నావా? జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పారని చెప్పుకొచ్చాడు.

  అంచనాలు పెంచిన ట్రైల్రర్

  అంచనాలు పెంచిన ట్రైల్రర్


  వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న మెగా హీరో సాయి తేజ్ 'రిపబ్లిక్' ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారని అర్ధం అవుతోంది, సీనియర్ నటి రమ్యకృష్ణ, నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. చూడాలి ఈ సినిమా ఈమేరకు ఆకట్టుకోనుంది అనేది చూడాలి.

  English summary
  Sources close to Pawan said he is going to attend Sai Dharam Tej's republic movie pre release function.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X