OG Premiere Show: ఓజీ తొలి షో అక్కడే? ఏపీ, తెలంగాణ, అమెరికాల కంటే ముందుగానే!
సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో పాటు ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. అయితే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సెప్టెంబర్ 24వ తేదీన స్పెషల్ షోలు పడనున్నాయి. ఒకరోజే ముందే తమ అభిమాన నటుడి సినిమా చూసేందుకు ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. ఇందుకోసం టికెట్ ధర ఎంతైనా సరే వెనుకాడటం లేదు.
ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో ప్రియాంక మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ప్రీమియర్స్‌కు పరుగులు
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగ రోజు.. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఎదురు చూస్తుంటారు. పైగా రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన నుంచి ఫుల్ మీల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా ఓజీలో పవన్ మేనరిజం, లుక్స్, స్టైల్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అటు సామాన్యులతో పాటు ప్రముఖుల్లోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వారంతా ప్రీమియర్స్‌కు పరుగులు తీస్తున్నారు.
భారీగా బెనిఫిట్ షో టికెట్ ధరలు
టాలీవుడ్ నుంచి రిలీజయ్యే ప్రతి పెద్ద చిత్రం నార్త్ అమెరికాతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోని కొన్ని ఏరియాలలో రిలీజ్ అవుతుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్‌కు ముందు రోజు కానీ తెల్లవారుజామున కానీ స్పెషల్ షోలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓజీ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. రెండు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అలాగే బెనిఫిట్ షోలకు రూ.1000 టికెట్ ధరను వసూలు చేసుకోవడానికి అనుమతించాయి.
ఓజీ తొలి షో ఎక్కడంటే?
ఇదిలాఉండగా తెలుగు రాష్ట్రాలు, అమెరికా కాకుండా వరల్డ్ వైడ్‌గా ఓజీ ఫస్ట్ షో మరో చోట ప్రదర్శితం కానుంది. అది ఎక్కడో కాదు బిహార్ రాజధాని పాట్నాలో. నగరంలోని ఎస్‌పీ వర్మ రోడ్‌లోని కాన్‌ప్లెక్స్ సినిమాస్‌లో ఈ షో పడనుంది. ఇక్కడ రాత్రి 9.30 గంటలకే ఓజీ బెనిఫిట్ షో స్క్రీనింగ్ కానుండగా.. ఆ తర్వాత బెంగళూరులో 9.25 గంటలకు షో వేయనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పావుగంట ఆలస్యంగా రాత్రి 9.30 గంటలకు ఓజీ షో వేయనున్నారు. తద్వారా ప్రపంచంలోనే ఓజీ ఫస్ట్ షో పడిన ప్రాంతంగా పాట్నా నిలవనుంది. మొత్తంగా రాత్రి 10 గంటల వరకు ఇండియా వైడ్‌గా ఓజీ స్క్రీనింగ్‌లు అన్ని ప్రాంతాల్లో మొదలు కానున్నాయి.


Click it and Unblock the Notifications











