twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంఎం శ్రీలేఖ రికార్డు బ్రేక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ప్లానింగ్ ఆడియో రిలీజ్

    |

    మ‌హేంద్ర‌- మ‌మ‌త కుల‌క‌ర్ణి ల‌ను నాయ‌కానాయిక‌లుగా ప‌రిచ‌యం చేస్తూ బి.ఎల్.ప్ర‌సాద్ (ప‌రిచ‌యం) ద‌ర్శ‌క‌త్వంలో సాయి గ‌ణేష్ మూవీస్ ప‌తాకంపై టి.వి.రంగ‌సాయి నిర్మించిన సినిమా ప్లానింగ్. అలీషా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. ఉద‌య్ కిర‌ణ్ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌ సి.క‌ళ్యాణ్ ఆడియో సీడీల్ని ఆవిష్క‌రించారు. రామ స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్‌, దర్శ‌కుడు భాను కిర‌ణ్, సంజ‌య్ త‌దిత‌రులు పాట‌ల్ని ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ పాల్గొంది.

    కొరియోగ్రాఫ‌ర్ కం హీరో మాట్లాడుతూ-ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో చ‌క్క‌ని ప్లానింగ్ తో చేసిన సినిమా ఇది. ఆశీస్సులు అందించిన పెద్ద‌ల‌కు, అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేసిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు.

    క‌థానాయిక మాట్లాడుతూ..ద‌క్షిణ భార‌త‌దేశంలో అన్ని భాష‌ల్లో సినిమాలు చేశాను. ఐటెమ్ గీతంతో కెరీర్ ప్రారంభించి క‌థానాయిక‌ను అయ్యాను. ఈ చిత్రంలో అద్భుత‌మైన పాత్ర‌లో అవ‌కాశం ఇచ్చారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు, ఆశీస్సులు అందించిన‌ పెద్ద‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు.

     Planning movie audio released by C Kalyan

    ముఖ్య అతిధి సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ-ఆడియో బావుంది. విజువ‌ల్స్ బాగా వ‌చ్చాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే విభేధం లేకుండా మంచి సినిమాని తీస్తున్నారు. చిన్న సినిమా అయినా చ‌క్క‌ని ప్లానింగ్ తో రంగ‌సాయి శెట్టి- ప్ర‌సాద్ ఈ చిత్రానికి ప‌ని చేశారు. విభిన్న‌మైన ప్ర‌య‌త్న‌మే ఇది. యువ‌త‌రం హీరో మ‌హేంద్ర చ‌క్క‌గా న‌టించారు. కొరియోగ్రాఫ‌ర్ కాబ‌ట్టి పాట‌ల్లోనూ చ‌క్క‌గా డ్యాన్సులు చేశారు. క‌థానాయిక‌కు న‌టిగా నిరూపించుకునే అవ‌కాశం ద‌క్కింది. ఇత‌ర భాష‌ల ఆర్టిస్టులతో పోలిస్తే ఈ చిత్ర క‌థానాయిక వేదిక‌పై చ‌క్క‌గా మాట్లాడుతున్నారు. రంగ సాయి క‌ళాతృష్ణ‌తో పెట్టుబ‌డులు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయ‌న మ‌రిన్ని చిత్రాలు చేయాలి అన్నారు.

    సాయి వెంక‌ట్ మాట్లాడుతూ-ఒక కొరియోగ్రాఫ‌ర్ హీరో కావ‌డం వ‌ల్ల ప‌ని సులువైంది. న‌టుడిగా తొణికిస‌లాడ‌కుండా చేశాడు. రంగ‌సాయి ఎంతో ప్లానింగ్ తో ఈ చిత్రం తీశారు. ఉద‌య్ కిర‌ణ్ సంగీతం ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ నిర్మాత‌ల హీరో. ఆయ‌న‌ కుమారుడే సంగీతం అందించారు. అత‌డు ఈ జ‌న‌రేష‌న్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ అన్నారు.

    రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ-రంగ‌సాయి గ‌తంలో ఓ సినిమా తీశారు. ఈసారి ప‌రిణ‌తితో ఈ సినిమా చేశారు. ఎం.ఎం.శ్రీ‌లేఖ త‌ర్వాత అతి చిన్న వ‌య‌సులో సంగీత ద‌ర్శ‌కుడిగా ఉద‌య్ కిర‌ణ్ నిరూపించుకుంటున్నారు. జ‌యాప‌జ‌యాల‌కు నిర్మాత‌తో పాటు టెక్నీషియ‌న్ శ్ర‌మించాలి. ప‌క్కా ప్లానింగ్ తో ఈ సినిమా తీయ‌డ‌మే ఓ స‌క్సెస్. పెద్ద సినిమా లేన‌ప్పుడు సినిమాని ప్లానింగుతో రిలీజ్ చేయాలి అన్నారు.

    నిర్మాత రంగ సాయి మాట్లాడుతూ-వెన్నుద‌న్నుగా నిలిచిన క‌ళ్యాణ్ గారు, స్నేహితులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ద‌ర్శ‌కుడితో ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైన‌ల్ చేసి సినిమా తీశాం. క‌థ పూర్త‌య్యాక దానికి త‌గ్గ‌ట్టు పాట‌ల్ని సంగీత ద‌ర్శ‌కుడు అందించారు. ఆర్య‌న్ చ‌క్క‌ని కెమెరా వ‌ర్క్ అందించారు. మ‌హేంద్ర‌, అలీషా ఎంతో స‌హ‌క‌రించారు. విజ‌యానికి సాయ‌ప‌డిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు.

    సంగీత దర్శ‌కుడు ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ- నేను మైన‌ర్‌నే అయినా మేజ‌ర్ అని నిరూపించుకునేలా చ‌క్క‌ని సంగీతం అందించాను. ఇక‌పై మైన‌ర్ అని పిల‌వొద్దు. ఈ పాటల్ని విని ఆస్వాధించండి అన్నారు.

    రంగ‌సాయి, ఉరుకుంద‌ప్ప‌, అస్మిత‌, ఆదిత్య చైత‌న్య‌, సంతోష్‌, సుప్రీం సాయి, తిరుమ‌ల‌రావు, విజ‌య్ కుమార్, శంక‌ర్, బార్బీ, అనూష‌, ప‌వ‌న్ కుమార్, ల‌క్ష్మి, ధ‌న‌ల‌క్ష్మి, ప్రిన్స్ వేణు, రాజేష్, విన‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. స‌హ‌నిర్మాత‌లు: బి.ధ‌నుంజ‌య్, బి.దేవి, ఎడిట‌ర్: నాగు, కొరియోగ్ర‌ఫీ: బ‌షీర్, ఫైట్స్: వాసు, నిర్వ‌హ‌ణ‌: బి.భూల‌క్ష్మి.

    English summary
    Planning movie getting for release. Choreographer Mahendra turned as Hero for this movie. Mamata Kulakarni is the Heroine. This movie audio released by Producer C Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X