Pooja Hegde కు బంపర్ ఆఫర్.. సౌత్ టాప్ హీరోతో బుట్టబొమ్మ!

అందాల భామ పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ రివ్వున తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రాల ఘన విజయాలను ఖాతాలో వేసుకొన్న ఈ ముద్దుగుమ్మ వెనుకకు తిరిగి చూసుకొన్న దాఖలాలు లేవు. తమిళంలో విజయ్‌తో బీస్ట్‌ చిత్రంలో నటిస్తూనే మరో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్‌ను తన బుట్టలో వేసుకొన్నది.

త్వరలో తెలుగు, తమిళ భాషల్లో యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే సినిమా కోసం పూజా హెగ్డేను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పూజా హెగ్డేను కలిసిన వెంకీ అట్లూరి స్క్రిప్ట్ నేరేట్ చేయగా ఆమె సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని ఆమె పీఆర్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ధనుష్‌తో జతకట్టడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఇక ఈ చిత్రంలో మరోసారి గ్లామర్‌తోపాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో బుట్టబొమ్మ కనిపించబోతున్నారు.

Pooja Hegde to romance with Dhanush for Venky Atluri

మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. వెంకీ అట్లూరి తన మేకింగ్‌కు భిన్నంగా విభిన్నమైన కథతో ప్రయోగం చేయబోతున్నారు. విద్యారంగంలో మాఫియా, విద్య ప్రైవేటీకరణపై యువకుడు సాగించే పోరాటం కథా నేపథ్యంగా మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం. జెర్సీ మూవీతో జాతీయ అవార్డు గెలుచుకొన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యువ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ధనుష్ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది.

ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అలాగే చిరంజీవి నటిస్తున్న ఆచార్య, ప్రభాస్‌తో రాధేశ్యామ్, విజయ్‌తో బీస్ట్ చిత్రాలతో జోష్‌ను కొనసాగిస్తున్నారు. హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, అలాగే భాయ్‌జాన్ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X