For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జాతీయ రహదారిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. అసలేం జరిగిందంటే?

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు, షూటింగులు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు చిన్న బడ్జెట్ చిత్రాలు చకచకా సినిమా షూటింగుల పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత చాలా ఎక్కువగా టాలీవుడ్‌లో సందడి చేసిన చిత్రాలు చిన్న నిర్మాతల సినిమాలే. చిన్న నిర్మాత నిర్మించిన కంటెంట్ పరంగా రిచ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జాతీయ రహదారి. ఈ సినిమా టైటిల్‌ వినగానే కొత్తగా, వినూత్నమైన కథతో వస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరందుకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా జాతీయ రహదారి సినిమా ట్రైలర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతకు ముందు దర్శకుడు నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న జాతీయ రహదారి చిత్రం థియేటర్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గారి చేతులమీదుగా విడుదల చేయడం తెలిసిందే. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

  Director K Raghavendra Rao Launches Jaathiya Rahadari Trailer

  జాతీయ రహదారి సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రఖ్యాత దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ... జాతీయ అవార్డు గ్రహీత, డైరెక్టర్ నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాతీయ రహదారి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నా చేతుల మీదుగా ఆవిష్కరించబడటం చాలా గొప్పగా, సంతోషంగా ఉంది. ట్రైలర్ చూడగానే .హృదయాన్ని హత్హుకునేలా ఉంది. నిర్మాత రామసత్య నారాయణ కెరీర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుంది అని అన్నారు.

  Popular Director K Raghavendra Rao unveiled Jatiya Rahadari trailer

  Ram Charan, Shankar కాంబినేషన్‌లో #RC15 వైభవంగా ప్రారంభం.. చిరంజీవి, రాజమౌళి, రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా

  నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా రంగంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు ఇష్టం. ఆయన చేతులు మీదుగా నేను రూపొందించిన జాతీయ రహదారి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకొని థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది. దర్శకుడు నరసింహ నంది అభినందించకుండా ఉండలేరు. నా పుట్టిన రోజున ట్రైలర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది అని అన్నారు.

  Ram Charan, Shankar కాంబినేషన్‌లో #RC15 వైభవంగా ప్రారంభం.. చిరంజీవి, రాజమౌళి, రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా

  దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.. నా జీవిత కల నెరవేరింది. నా గురువు దర్శకుడు గోపాల్ గారికి గురువు రాఘవేంద్రరావు. ఆయన జాతీయ రహదారి ట్రైలర్ చూసి నచ్చిందని చెప్పారు. తప్పకుండా సినిమా కూడా చూస్తాను అని అన్నారు. ఆయన చెప్పిన మాటలతో నా ఆనందానికి అవధులు లేవు. ఇంతకంటే గొప్ప విషయం నా జీవితంలో ఏదీలేదు. నాపై నమ్మకం ఉంచి నాతో సినిమా తీసిన నిర్మాత రామ సత్యనారాయణకు ధన్యవాదాలు అని అన్నారు.

  Sunny Leone: బీచ్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన సన్నీ లియోన్.. బికినీతో అందాలు మొత్తం చూపిస్తూ!

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి, దక్షిత్‌రెడ్ది, అభి, తెల్జెరు మల్లేష్, తరని, గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్, విజయ భాస్కర్, సిద్దిపేట రవి తదితరులు
  నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
  రచన, దర్శకత్వం: నరసింహ నంది
  సినిమాటొగ్రఫి: యస్ మురళీమోహన్‌రెడ్డి
  సంగీతం: సుక్కు
  పాటలు: మౌన శ్రీ మల్లిక్
  ఎడిటర్: వీ నాగిరెడ్డి
  సమర్పణ: సంధ్య స్టూడియోస్ రవి కనగల
  పీఆర్వో: మధు వీఆర్
  రిలీజ్ డేట్: 2021-09-10

  English summary
  Director VV Vinayak unveils Jatiya Rahadari trailer. produced by T Ram Satyanarayana directed by Narsimha Nandi. This movie is nominated to Filmfare and 68 national awards.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X