twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా ఉంటే కుక్క చావే.. ఇండస్ట్రీ బహిష్కరించినా బాధ లేదు: పోసాని సంచలన వ్యాఖ్యలు

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రచయితగా దర్శకుడిగా మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయాల గురించి ప్రస్తావించిన అనంతరం పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పై కూడా వ్యాఖ్యలు చేసిన అనంతరం పోసాని కృష్ణమురళి చాలా సైలెంట్ అయిపోయాడు. రీసెంట్ గా హఠాత్తుగా పోసాని సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఆ వివరాల్లోకి వెళితే...

    రాజకీయాల్లో..

    రాజకీయాల్లో..

    పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా నిలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై కూడా చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం వారిని తీవ్ర స్థాయిలో విమర్శలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సినీ ప్రముఖులతో జరిపిన చర్చల్లో కూడా పాల్గొన్నారు.

     నేను ఏమిటో తెలియదు

    నేను ఏమిటో తెలియదు

    మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పోసాని కృష్ణ మురళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబు గాని అలాగే వారి పిల్లలు కూడా చాలా సామాన్యమైన వ్యక్తులు. నా మాదిరిగానే.. చాలా మందికి నేను తెలుసు గాని నేను ఏమిటో తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు మరొకసారి చెబుతాను. నేను చదువు పూర్తి చేసిన తర్వాతనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను.. అని అన్నారు.

    అప్పుడే బాగా తెలిసింది

    అప్పుడే బాగా తెలిసింది

    మొదట నేను అసిస్టెంట్ రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర వర్క్ చేశాను. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది నాకు పరిచయమయ్యారు. మోహన్ బాబు గారు కూడా అప్పుడే నాకు తెలుసు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఏమిటో నాకు అప్పుడే చాలా బాగా తెలిసింది. ఇండస్ట్రీలో నన్ను చాలా బాగా ఇష్టపడే వారిలో బి.గోపాల్ ఒకరు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశాను. అయితే ఆయన నా దగ్గర పని చెయ్ అని చెప్పినప్పుడు పరుచూరి వాళ్ళు ఒప్పుకోలేదు.

     వాళ్ళ తరహాలో బ్రతకాకూడదు అని..

    వాళ్ళ తరహాలో బ్రతకాకూడదు అని..

    పరుచూరి బ్రదర్స్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఐదేళ్ల సినీ ప్రయాణం తర్వాత వారి నుంచి మరొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకున్నాను.. పరుచూరి బ్రదర్స్ తరహాలో మాత్రం బ్రతకకూడదు అనుకుంటున్నా.. అలా మాత్రం బ్రతకడం లేదు.... నిజానికి వాళ్లకు ఎలా బ్రతకాలో కూడా తెలియదు. దాదాపు 20 ఏళ్ళ పాటు వాళ్ళు అద్భుతమైన సినిమాలకు వర్క్ చేశారు. అలాంటి వారిని అలాగే ఆత్రేయ వంటి గొప్ప వారిని ఇండస్ట్రీ ఎంత దూరం పెట్టిందో నాకు తెలుసు.. అని అన్నారు.

    కుక్క చావు చస్తాను అని అర్ధమయ్యింది..

    కుక్క చావు చస్తాను అని అర్ధమయ్యింది..

    పరుచూరి బ్రదర్స్ వేటూరి శ్రీశ్రీ ఇలా చాలా మందిని చూసి వీరి లాగా బ్రతక కూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకవేళ అలా బ్రతికితే జీవితాంతం బ్రతకలేను. కుక్క చావు చేస్తాను అని అర్థమయింది. చస్తే పదిమంది రావాలి. ఇక్కడ చావు కూడా చాలా ఖరీదుగా ఉంటుంది. పెదరికం చావు పది మందిని కూడా రానివ్వదు. కానీ డబ్బున్న చావు మాత్రం పదివేల మందిని తీసుకు వస్తుంది. వీటి మధ్య ఉండడం నాకు ఇష్టం లేదని కొన్నాళ్ళు నా కుటుంబంతో కాస్త దూరంగా బ్రతుకుతున్నాను. అని అన్నారు.

    సంపాదించుకుంటూ కూర్చుంటా..

    సంపాదించుకుంటూ కూర్చుంటా..

    అయితే రేపు పొద్దున సినిమా పరిశ్రమ పోసాని కృష్ణమురళి బహిష్కరించిన కూడా అంతవరకు నేను సంపాదించుకుంటూ కూర్చుంటాను. నేను తెలుగు చిత్రపరిశ్రమలోనే బ్రతుకుతున్నాను. సినిమానే నమ్ముకున్నాను ఇక్కడ ఎవరి దగ్గర మందు పోసుకుంటూ చెంచా గా పని చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్రతుకు నాకు వద్దు కూడా. ఇండస్ట్రీలో నేను చాలా చూశాను ఇండస్ట్రీ నాకు అన్నీ ఇచ్చింది. ఈ తరుణంలో నాకు ఏది వచ్చినా కూడా బోనస్ అనే చెప్పాలి... అంటూ పోసాని కృష్ణమురళి సన్ ఆఫ్ ఇండియా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు.

    English summary
    Posani krishna murali shocking comments in son of india pre release event,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X