RRR మించి రాధే శ్యామ్ ప్రమోషన్స్‌.. ప్రభాస్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ పరిస్థితులు, భయాందోళనల మధ్య మూడు ప్యాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీగా కోవిడ్ ఆంక్షలు విధించడం ఈ మూడు సినిమా యూనిట్లలో గందరగోళం వ్యక్తమవుతున్నది. చివరి నిమిషం వరకు కూడా ఏం జరుగుతుందనే విషయం చర్చనీయాంశమైంది. అయితే రాధేశ్యామ్ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాకపోవడంపై అభిమానులు అందోళన చెందుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

RRR , Radhe Shyam Movies కి పొంచి ఉన్న గండం | Filmibeat Telugu
 1960 బ్యాక్ డ్రాప్‌తో

1960 బ్యాక్ డ్రాప్‌తో

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్ చిత్రం జాతకాల కథా నేపథ్యంగా పిరియాడిక్ ఫిలింగా తెరకెక్కింది. ఈ సినిమా కథ 1960 బ్యాక్ డ్రాప్‌తో యూఎస్‌లో జరుగుతుంది. ప్రేమకథగా రూపొందే ఈ చిత్రం క్లాసిక్‌గా ఉండబోతుందనేది సినీ వర్గాల సమాచారం.

 జనవరి 14వ తేదీన రిలీజ్‌

జనవరి 14వ తేదీన రిలీజ్‌


రాధేశ్యామ్ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్‌కు ముస్తాబైంది. ఏకంగా రాజమౌళి రూపొందించే RRR సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఢీకొట్టబోతున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ వెనుకబడినదనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే RRR సినిమా జోరుగా ప్రమోషన్స్ చేస్తుంటే.. రాధే శ్యామ్ ఇంకా ప్రచార కార్యక్రమాలు ఆరంభించకపోవడం ఆసక్తిగా మారింది.

RRRని మించి ప్రమోషన్స్

RRRని మించి ప్రమోషన్స్

రాధేశ్యామ్ ప్రచారం కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించడానికి యూనిట్ రంగం సిద్ధం చేస్తున్నది. జనవరి 7వ తేదీన ప్రమోషన్స్ ప్రారంభించి.. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డేలకు సంబంధించిన పర్యటన వివరాలు ఖరారు అయ్యాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సినిమా తారలు మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. RRRని మించి ప్రమోషన్స్ చేపట్టనున్నారు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

ఇక అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఆరంభం కాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అవుతుందా లేదా అని చర్చించుకొంటున్నారు. అయితే తాము చెప్పే వరకు అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించకూడదని యూఎస్‌లో థియేటర్ ఓనర్లకు డిస్టిబ్యూటర్లు చెప్పారనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారనున్నదా అనే అనుమానం కలిగింది. అయితే యూనిట్ వర్గాల మాత్రం రిలీజ్ డేట్ మార్పు లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది.

రాధేశ్యామ్ ఓటీటీలో ఎప్పుడంటే?

రాధేశ్యామ్ ఓటీటీలో ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా, రాధే శ్యామ్ సినిమా రిలీజ్‌తోపాటు ఓటీటీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా యూనిట్‌కు, ఓటీటీ సంస్థలకు కుదిరిన ఒప్పందం ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన ఉంది. దాంతో ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయితే.. ఫిబ్రవరి 13 తేదీ తర్వాత ఎప్పుడైనా ఓటీటీలోకి రావచ్చనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X