‘జాన్’లో ప్రభాస్ రోల్ లీక్.. యంగ్ రెబెల్ స్టార్ వాటన్నింటినీ మాయం చేసేస్తాడట

By Manoj Kumar P

'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్‌కు పేరు రావడంతో పాటు మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ సినిమాలకు భారీ క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అతడు నటించిన సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేశారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..?

 అనుకున్నదొకటి.. అయింది మరొకటి

అనుకున్నదొకటి.. అయింది మరొకటి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సాహో' అనే సినిమా చేశాడు. దాదాపు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో అతడి ఫ్యాన్స్‌కు నిరాశ.. నిర్మాతలకు నష్టాలు మిగిలాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు

సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సాహో' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్'. 1960వ దశకం నాటి కథతో వస్తున్న ఈ మూవీని ‘జిల్' ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పిరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూపించబోతున్నారు.

ప్రభాస్ గ్యాప్ ఎందుకు ఇచ్చాడు?

ప్రభాస్ గ్యాప్ ఎందుకు ఇచ్చాడు?

వాస్తవానికి ‘సాహో'కు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. యూరప్‌లో కొన్ని సన్నివేశాలు సైతం చిత్రీకరించారు. కానీ, వాటిని అలా వదిలేసి సరికొత్తగా స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. దీంతో ప్రభాస్ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫారెన్ టూర్‌లో బిజీగా ఉన్నాడు. అతడు గ్యాప్ ఎందుకు తీసుకున్నాడని చర్చ జరుగుతోంది.

 ఒకటి కాదు.. ఎన్నో వైరల్ అయ్యాయి

ఒకటి కాదు.. ఎన్నో వైరల్ అయ్యాయి

పూర్తి లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నటించే ఆర్టిస్టుల గురించి మాత్రమే కాకుండా.. ఈ సినిమా స్టోరీ లీక్ అయిందని కూడా ప్రచారం జరిగింది. అలాగే, ఇందులో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని కూడా టాక్ ఉంది. దీంతో ఈ చిత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది.

‘జాన్'లో ప్రభాస్ రోల్ లీక్

‘జాన్'లో ప్రభాస్ రోల్ లీక్

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఈ స్టార్ హీరో దొంగగా కనిపించబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. ఇందులో అతడు పాత కాలపు కార్లు, బైకులు దొంగతనం చేస్తుంటాడని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రేమలో పడడం.. ఆమె కోసం దొంగతనాలు మానేయడం చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X