For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కార్తీక దీపం హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ: అక్కినేని హీరోతో వంటలక్క.. ఏ పాత్ర చేస్తుందంటే!

  |

  తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఎక్కువ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది 'కార్తీక దీపం'. టీఆర్పీ పరంగా రికార్డులను తిరగ రాసిన ఇది.. దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక, ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు ఎంతటి గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. దీప అలియాస్ వంటలక్కగా ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన యాక్టింగ్ అందరికీ గుర్తుండిపోతుంది. అందుకే ఇప్పుడీ వంటలక్క టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనిపై ప్రకటన కూడా వచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అక్కడ సక్సెస్.. ఫుల్ పాపులర్

  అక్కడ సక్సెస్.. ఫుల్ పాపులర్

  మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే తన హవాను చూపించి స్టార్‌గా ఎదిగిపోయింది ప్రేమీ విశ్వనాథ్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సీరియళ్లలో నటించిన ఆమె.. 'కరుతముత్తు' అనే సీరియల్‌లో అద్భుతమైన యాక్టింగ్‌తో అలరించింది. ఇందులో ఆమె పోషించిన పాత్ర హైలైట్ అయింది. ఫలితంగా ఎన్నో ఆఫర్లను దక్కించుకుని పాపులర్ అయింది.

  Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

  తెలుగింటి ఆడపచులా మారి

  తెలుగింటి ఆడపచులా మారి

  'కరుతముత్తు'లో ప్రేమీ విశ్వనాథ్‌ నటన చూసిన తెలుగు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర 'కార్తీక దీపం' కోసం ఆమెను మన ఇండస్ట్రీకి తీసుకు వచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీరియల్‌లో దీప అలియాస్ వంటలక్కగా ఆమె అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎలాంటి సీన్‌నైనా అలవోకగా చేస్తూ మెప్పించింది. దీంతో తెలుగింటి ఆడపడుచులా మారిపోయింది.

  సీరియల్‌లోకి రీఎంట్రీ ఇచ్చి

  సీరియల్‌లోకి రీఎంట్రీ ఇచ్చి

  కొద్ది రోజుల క్రితమే 'కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను చంపేశారు. దీంతో వాళ్లిద్దరి పిల్లల మధ్యన గొడవను పెట్టి సీరియల్‌ను తర్వాతి తరం వాళ్లతో నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నటులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీరియల్ డల్ అయింది. దీంతో మరోసారి ప్రేమీ విశ్వనాథ్‌, నిరుపమ్ పాత్రలను తీసుకు వచ్చారు.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  తెలుగులో బోలెడన్ని ఆఫర్లు

  తెలుగులో బోలెడన్ని ఆఫర్లు

  'కార్తీక దీపం' సీరియల్‌లో వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆమెకు బుల్లితెరపై మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే, ఆమెను ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు కూడా సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. అయితే, డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా ప్రేమీ విశ్వనాథ్ వాటిని రిజెక్ట్ చేసిందని తెలిసింది.

  టాలీవుడ్‌లోకి ప్రేమీ ఎంట్రీ

  టాలీవుడ్‌లోకి ప్రేమీ ఎంట్రీ

  తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌గా వెలుగొందుతోన్న ప్రేమీ విశ్వనాథ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అక్కినేని నాగ చైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ద్వారా ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. తాజాగా ప్రేమీ విశ్వనాథ్‌కు స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ఓ ప్రకటన వదలడంతో ఇది బయటకు వచ్చింది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

  అలాంటి పాత్రలో వంటలక్క

  అలాంటి పాత్రలో వంటలక్క


  ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో ప్రేమీ విశ్వనాథ్ ఎలాంటి పాత్రను చేస్తుందన్న దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె ఇందులో నాగ చైతన్య సోదరిగా నటిస్తుందని తెలిసింది. ఈ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని, హీరోతో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

  రెండు భాషల్లో రాబోతుంది

  రెండు భాషల్లో రాబోతుంది


  వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న అక్కినేని నాగ చైతన్య.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రియమణి కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే ప్రకటించింది.

  English summary
  Akkineni Naga Chaitanya Recently Started His 22nd Movie With Venkat Prabhu. Serial Heroine Premi Viswanath to paly Key Role in This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X