చిరంజీవి డిజాస్టర్ మూవీపై నిర్మాత షాకింగ్ కామెంట్.. రీమేక్ సినిమా అని చెప్పినా? అంటూ
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర టెలివిజన్ రంగంలో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ATV ద్వారా ఓ రియాలిటీ షో ను డిజైన్ చేసి సినిమా మేకింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో తన విజన్‌ను మీడియాకు వివరించారు. అలాగే సినిమా రంగంలోని రాణించాలనుకొనే ఔత్సాహికులకు శుభవార్త చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను నిర్మించిన సినిమా డిజాస్టర్ కావడంపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన ఏమని కామెంట్ చేశారు? ఆయన విజన్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
2008 సంవత్సరంలో రియాలిటీ షోలతో ATV ఛానెల్‌ను ప్రారంభించాం. కానీ టెలివిజన్ ఇండస్ట్రీ గురించి తెలియకపోవడం వల్ల.. మా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ప్రస్తుతం పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మళ్లీ కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాం. సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది ఫోన్లు కూడా ఎత్తరు. అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశాం అని అనిల్ సుంకర తెలిపారు.

చాలా మంది సినిమా తీయాలనే తపనతో సొంతంగా సంపాదించిన డబ్బుతో నిర్మించి నష్టపోయి కష్టాల పాలు అవ్వడం చూస్తుంటాం. చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూసాను. ఈ రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగింది. ప్రొడక్షన్‌లో అనవసరమైన ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలకు, సవాళ్లకు నిర్మాత అధిగిమించే విధంగా ఈ రియాల్టీ షో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అని అనిల్ సుంకర తెలిపారు.
ఈ రియాల్టీ షో ద్వారా మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్ ఎంపిక చేస్తాం. వాటిని పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్ల సేవలను వాడుకొంటాం. మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ ఫైనల్ స్క్రిప్ట్లకు అన్ని విభాగాల్లో పనిచేసే నిపుణులను, ఆర్టిస్టులను షో ద్వారా ఎన్నుకుంటాం. ఆ స్క్రిప్ట్స్ నేరుగా ఆసక్తి ఉన్న నిర్మాతలు బిడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయలలో కేవలం 30 రోజులలోనే సినిమా పాటలతో సహా షూటింగ్ జరిపేలా ఒక అద్భుతమైన ప్రణాళికను రెడీ చేయబోతున్నాం అని తెలిపారు.
తాను ఎన్నో సినిమాలు తీశాను. కానీ ఎప్పుడైతే ఫ్లాప్ సినిమా తీశామో.. అప్పుడు అందరూ మీరు ఎందుకు కథ లేకుండా సినిమా ఎందుకు తీస్తారు అని ప్రశ్నిస్తారు. కథ విన్నారా? కథలు లేకుండా సినిమా తీస్తారా? ఓ సందర్భంలో నేను ఐటీ ఆఫీస్‌కు వెళ్తే.. నాపై అక్కడి ఉద్యోగి జాలి చూపించారు. ఎందుకండీ.. స్టోరీలతో సినిమాలు తీయవచ్చు కదా అని అడిగాడు. అయితే నేను తీసింది.. రీమేక్ సినిమా అంటే అతడికి అర్ధం కాలేదు. ఆ సినిమా ఏంటో మీకు అర్ధమై ఉంటుంది కదా అని అన్నారు. అయితే అనిల్ సుంకర కామెంట్ చేసింది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా గురించి.. ఆ డిజాస్టర్ మూవీని ఉద్దేశించి కామెంట్ చేశారు అని నెటిజన్లు చర్చించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











