twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.210కోట్లు చెల్లించాల్సిందే.. ఏపీ ప్రభుత్వంపై నిర్మాత అశ్వినీదత్ పిటిషన్

    |

    జగదేక వీరుడు, ఇంద్ర, మహానటి వంటి హిట్ సినిమాలను అందించిన వైజయంతి మూవీస్ నెక్స్ట్ ప్రభాస్ 21వ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండే టాలీవుడ్ సీనియర్ నిర్మాత సి.అశ్వినీదత్ ఇటీవల ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది.

    రూ.210కోట్ల చెల్లించాలని డిమాండ్

    రూ.210కోట్ల చెల్లించాలని డిమాండ్

    భూ సమీకరణ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ సీనియర్ నిర్మాత సరికొత్త కండిషన్ తో తనకు ఏపీ ప్రభుత్వం 210కోట్లు చెల్లించాలని పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో వైజయంతి ప్రొడక్షన్ పై తప్పుడు ఆరోపణలు రాకముందే ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద గత ఏడాది అశ్వినీదత్ ప్రభుత్వానికి 39ఎకరాలు ఇవ్వాల్సి వచ్చింది.

     గన్నవరం ఎయిర్ పోర్ట్ కోసం 39 ఎకరాలు

    గన్నవరం ఎయిర్ పోర్ట్ కోసం 39 ఎకరాలు

    వివరాల్లోకి వెళితే గత ఏడాది అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయనున్నారు అనగానే అక్కడ భూమి రేట్ ఒక్కసారిగా అకాశాన్ని తాకింది. ఇక గన్నవరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విమానాశ్రయం కోసం భూ సేకరణ చర్యలు చేపట్టగా అందులో అశ్వినీ దత్ 39 ఎకరాలు ఇవ్వాల్సి వచ్చింది. అంతే విలువ కలిగిన భూమిని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏతో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.

     పిటిషన్ దాఖలు చేసిన అశ్వినీదత్

    పిటిషన్ దాఖలు చేసిన అశ్వినీదత్

    అయితే రాజధానిని అమరావతి నుంచి మరో చోటుకు తరలించనున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా అక్కడ భూమి విలువ తగ్గిపోయింది. ఎకరంకు కనీసం 30లక్షల రూపాయల ధర కూడా పలకడం లేదని తెలిపిన నిర్మాత గన్నవరంలో ఎకరాకు రూ.కోటి 54లక్షలు ఉందని పిటిషన్ లో వివరణ ఇచ్చారు. దీంతో తన 39ఎకరాలకు మొత్తంగా రూ.210కోట్ల రూపాయలు చెల్లించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ, ప్రభుత్వాన్ని పార్టీలుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

    Recommended Video

    Vyjayanthi Movies Recalls SR NTR Humble Nature Towards Producers
    అశ్వినీదత్ తో పాటు మరికొందరు కూడా

    అశ్వినీదత్ తో పాటు మరికొందరు కూడా

    మార్కెట్ వ్యత్యాసం భట్టి అశ్వినీ దత్ ప్రభుత్వాన్ని కోరిన విధానంపై త్వరలోనే హై కోర్టు విచారణ జరపనుంది. కేవలం అశ్వినీదత్ అనే కాకుండా చాలా మంది వ్యాపారవేత్తలు అమరావతి రాజధాని అవుతుందని నమ్మకంతో చాలా చోట్ల భూములను వధులుకోవాల్సి వచ్చింది. అశ్వినీదత్ తో పాటు మరికొందరు కూడా ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    English summary
    It is a known fact that Vaijayanti Movies , which has produced hit films like Jagadeka Veerudu ayhiloka sumdari, Indra and Mahanati, is making Prabhas 21st film as Pan India. However far from controversial Tollywood senior producer C. Ashwinidat has recently filed a petition in the Andhra Pradesh government against the government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X