twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగచాటు వ్యాపారాలు వద్దు.. సీ కల్యాణ్ వార్నింగ్, చిరంజీవి సపోర్ట్ ఉందని..

    |

    ఆదివారం జ‌రిగిన ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఎన్నిక‌ల్లో మ‌న కౌన్సిల్‌-మ‌న ప్యానెల్‌ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ ఎన్నిక‌ల్లో సి.క‌ల్యాణ్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు.వైస్ ప్రెసిడెంట్స్‌గా కె.అశోక్‌కుమార్‌,
    వై.వి.ఎస్‌.చౌద‌రి, సెక్ర‌ట‌రీగా టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, మోహన్ వడ్లపట్ల జాయింట్ సెక్రటరీగా, ట్రెజ‌ర‌ర్‌గా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు.

    అలాగే ఈసీ మెంబ‌ర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌కుమార్ వ‌ల్ల‌భ‌నేని, బండ్ల‌గ‌ణేశ్‌, ఆచంట గోపీనాథ్, ప‌ల్లి కేశ‌వ‌రావు, శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, జి.వి.న‌ర‌సింహారావు, ఎస్‌.కె.న‌యీమ్ అహ్మ‌ద్‌, ప‌రుచూరి ప్ర‌సాద్‌, టి.రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, వి.సాగ‌ర్‌, వ‌జ్జా శ్రీనివాస‌రావు, పి.సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంక‌టేశ్వ‌ర‌రావు, వి.వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నిక‌య్యారు.

     ఈర్ష్య‌తోనే, బాధ‌తోనో రాలేని వారికి

    ఈర్ష్య‌తోనే, బాధ‌తోనో రాలేని వారికి

    ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధ్య‌క్షుడిగా సి .క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధ‌న్య‌వాదాలు. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌ను కాపాడ‌టానికి, పోరాటం చేయ‌డానికి మా మీద న‌మ్మ‌కంతో ఓటింగ్‌లో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ మా మ‌న ప్యానెల్ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. మా మీద ఈర్ష్య‌తోనే, బాధ‌తోనో, కోపంతో, మ‌రేదో ఇబ్బందుల్లో ఉండో ఈరోజు ఓటింగ్‌కి రాలేక‌పోయిన వారికి కూడా మా ధ‌న్య‌వాదాలు. ఎందుకంటే ఇది క్లిష్ట‌మైన సిచ్యువేష‌న్స్ అని చెప్పి ఉన్నాను.

    ఒక్కతాటిపైకి రావాలని

    ఒక్కతాటిపైకి రావాలని

    1999 నుంచి నేను హైద‌రాబాద్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో కీల‌క మెంబ‌ర్‌గా ఎదుగుతూ వ‌చ్చాను. ఎలాంటి ఎన్నిక‌లు లేకుండా, ఆర్గ‌నైజేష‌న్ విడిపోయింది.. దాన్ని ఒక‌టిగా క‌లుపుదామ‌నే స‌దుద్దేశంతో పెద్ద‌ల‌తో చ‌ర్చించి, ఒక ప్యానెల్‌గా ఉండాల‌ని నిర్ణ‌యించుక‌ున్నాం. నేను, ప్ర‌స‌న్న‌కుమార్‌, ఆది శేష‌గిరిరావు, మ‌ల్టీడైమ‌న్ష‌న్ రామ్మోహ‌న్‌రావుగారు, చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారితో చ‌ర్చించి అంద‌రం ఒక తాటిపై ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాం.

    డిపాజిట్లు రాలేవని గుర్తుపెట్టుకోవాలి

    డిపాజిట్లు రాలేవని గుర్తుపెట్టుకోవాలి

    ప‌ద‌వీ వ్యామోహ‌హో ఏమో కానీ.. ఓ ఆర్గ‌నైజేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న వ్య‌క్తి క‌నీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేక‌పోయాడు. అలాంటి సంద‌ర్భంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డ‌మే వృథా. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఉండుంటే ల‌క్ష‌, ల‌క్ష‌న్న‌ర రూపాయలు మిగిలి ఉండేవి. అది ఓ చిన్న నిర్మాత‌కు ఉప‌యోగ‌ప‌డేవి. జ‌రిగిందేదో జ‌రిగింది. ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ దారికి వ‌చ్చి లీడ్ చేయాల్సిందే. పుట్ట‌గొడుగుల్లాంటి ఆర్గ‌నైజేష‌న్స్ వ‌స్తే అవి బ్ర‌త‌క‌వు. అంద‌రం వ్యాపారం చేసుకునేవాళ్ల‌మే. ఎవ‌రు ఎన్ని ఆర్గ‌నైజేష‌న్స్ పెట్టినా, ముందు ఇక్క‌డ‌కు వ‌చ్చి ఎదిగిన‌వాళ్లే. ఆర్గ‌నైజేష‌న్ ఒక‌టిగా ఉండ‌టానికి ఎన్నికైన 23 మంది ఎలాంటి త్యాగం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను.

    చిరంజీవి సపోర్ట్‌తో

    చిరంజీవి సపోర్ట్‌తో

    ఎన్నిక‌లు కాగానే మీ వెనుక నేనున్నానంటూ మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. రేపు ఆయ‌న్ని వెళ్లి క‌లుస్తున్నాం. ఆయ‌న స‌హ‌కారంతో, అంద‌రి సినీ పెద్ద‌ల స‌హకారంతో అంద‌రికీ న్యాయం జ‌రిగేలా పోరాటం చేస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను. మా పోరాటం జ‌ర‌గ‌ని రోజు రోడ్డు మీద‌కి వ‌చ్చి ధ‌ర్నాలు చేసి ఆర్గ‌నైజేష‌న్‌ను నిల‌బెట్టుకోవ‌డానికి నేను ముందుంటానని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసుకుంటున్నాం. ఆర్గ‌నైజేష‌న్ ఒక‌టిగా ఉండాల‌నేదే మా స్లోగ‌న్‌. వెల్ఫేర్ జ‌ర‌గాలి. ట్రైల‌ర్స్ కానీ, యాడ్స్ కానీ..ఏదైనా కానీ.. ఈ కౌన్సిల్ నుంచే పంపాల‌ని, వేరే దొంగ‌చాటు వ్యాపారం వ‌ద్దు. గిల్డ్ వాళ్లు కూడా ఈ ఆర్గ‌నైజేష‌న్‌లో ఉండాల‌ని కోరుతాం. అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ‌తాం`` అన్నారు.

     ఇండస్ట్రీ బలంగా ఉండాలని

    ఇండస్ట్రీ బలంగా ఉండాలని

    ట్రెజ‌ర‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అంద‌రికీ అభినంద‌న‌లు. ఎన్నిక‌ల ముందు ఏ మాట మీదైతే ఉన్నామో, ఇప్పుడు ఆ మాట‌పైనే ఉన్నాం. అంద‌రూ మాతో క‌లిసి మాతో ప్ర‌యాణించాల‌ని కోరుతున్నాం. నిర్మాత‌లు ఎంత బ‌లంగా ఉంటే ఇండ‌స్ట్రీ అంత బ‌లంగా ఉంటుంది. మేమంతా ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ బిడ్డ‌లుగా ఉండాలని కోరుకుంటున్నాం`` అన్నారు

    English summary
    Producer C Kalyan elected as President in Producer Council elections which held on June 30th in Hyderabad. After victory, He spoke to media and warn to entertain the illegal proctices in Tollywood. He conveyed thanks for supporting Man Panel in this elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X