twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారీ కన్నుమూత.. టాలీవుడ్ దిగ్బ్రాంతి.. ఆయన సినిమాలు ఇవే!

    |

    తెలుగు ప్రేక్షకులకు గొప్ప అనుభూతి, కుటుంబ కథా చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారీ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 8.50 గంటలకు చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు78 సంవత్సరాలు. ఆయన మరణం వార్తతో తెలుగు సినిమా ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.

    Katragadda Murari

    కాట్రగడ్డ మురారీ వ్యక్తిగత వివరాలల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 1944 జనవరి 14వ తేదీన జన్మించారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టాను పుచ్చుకొన్నారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమపై అభురుచితో మద్రాసులో అడుగుపెట్టారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మించారు.

    కాట్రగడ్డ మురారీ సినిమాల విషయానికి వస్తే.. శోభన్ బాబు, కృష్ణంరాజు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్రహీరోలతో సినిమాలు రూపొందించారు. 1978లో సీతామహాలక్ష్మి, గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామకల్యాణం, శ్రీనివాస కల్యాణం, జానకీ రాముడు, నారి నారి నడుమ మురారీ లాంటి చిత్రాలను నిర్మించారు.

    కాట్రగడ్డ మురారీ నిర్మించిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్. తాను తీసిన అన్ని సినిమాలకు కేవీ మహాదేవన్ సంగీతం అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

    కాట్రగడ్డ మురారీ తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర అనే పుస్తకాన్ని ఎడిట్ చేశారు. తన బయోగ్రఫి నవ్వి పోదురుగాక అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

    English summary
    Producer Katragadda Murari passed away at the age of 78 due to Ill health. He was born on 14 June 1944 in Vijayawada in Krishna district of Andhra Pradesh. He dropped out of final year M.B.B.S at Kakatiya Medical College Warangal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X