twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత.. 30 ఏళ్లుగా 40 చిత్రాలతో

    |

    టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కండేపి సత్యనారాయణ ఇక లేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన ఓ నిర్మాతను తెలుగు, తమిళ సినీ పరిశ్రమ కోల్పోయింది. నిర్మాత కండేపీ సత్యనారాయణ గురించి మరిన్ని వివరాలు..

    Recommended Video

    Producer Suresh Babu Emotional Words About Kodi Ramakrishna | Filmibeat Telugu
    కండేపి సత్యనారాయణ మరణం గురించి

    కండేపి సత్యనారాయణ మరణం గురించి

    కండేపి సత్యనారాయణ మరణం గురించి సన్నిహితులు వెల్లడిస్తూ.. ఆయన కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. ఆదివారం రాత్రి 8.50 నిమిషాలకు ఆయనకు గుండెనొప్పి తీవ్రమైంది. హాస్పిటల్‌కు తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచారు అని చెప్పారు.

    కండేపీ సినీ జీవితం

    కండేపీ సినీ జీవితం

    కండేపి సత్యనారాయణ సినీ జీవితం పాండురంగ మహత్యం అనే చిత్రాన్ని డబ్బింగ్ చేయడం ద్వారా మొదలైంది. ఇప్పటి వరకు తమిళ, తెలుగు భాషల్లో కలిపి మొత్తం 40 చిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన కుటుంబ కథా చిత్రాలు మహిళా ప్రేక్షకులను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకర్షించాయి.

     కండేపి నిర్మించిన సినిమాలు

    కండేపి నిర్మించిన సినిమాలు

    కండేపీ సత్యనారాయణకు ప్రముఖ నటుడు, దివంగత శోభన్‌బాబుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయనతో కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, దొరగారింట్లో దొంగోడు లాంటి చిత్రాలను నిర్మించారు. ఆయన రూపొందించిన చిత్రాల్లో మాయామోహిని, బ్రహ్మన్న ఉన్నాయి. దేవీ పుత్రుడు చిత్రాన్ని హిందీలోకి ఆజ్ కా దేవీపుత్రగా డబ్బింగ్ చేశారు. కొద్దికాలంగా సినీ నిర్మాణానికి ఆయన దూరంగా ఉంటున్నారు.

     నిర్మాతగా మూడు దశాబ్దాలు

    నిర్మాతగా మూడు దశాబ్దాలు

    గత మూడు దశాబ్దాలపాటు నిర్మాతగా విశేష సేవలంందించిన కొండేపి సత్యనారాయణ మరణంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంతో ఓ మంచి నిర్మాతను సినీ పరిశ్రమ కోల్పోయింది అంటూ సంతాప ప్రకటనలో పేర్కొంటున్నారు.

    English summary
    Proudcer kandepi satyanarayana no more. He died with heart attack in Bangalore on Sunday 8.30 pm. He produced Kongumudi. Sreevaru, sakkanodu, Mayamohini and others. His First dubbing film is pandurangamahathyam & over all 40 films in Tamil
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X