‘తొడలు కొట్టినా.. కన్నీరు పెట్టుకున్నా.. సినిమాలు ఆడవు’
ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా పోయింది. ప్రేక్షకులు స్టార్ వ్యాల్యూ కంటే కంటెంట్‌ని ఎక్కువగా ప్రాధాన్యంగా చూస్తున్నారు. కథ బాగుంటే, ఎమోషన్ కరెక్ట్‌గా కనెక్ట్ అయితే చాలు. ఏ సినిమా అయినా.. సక్సెస్ అవుతుంది . ఇదే విషయాన్ని తాజాగా 'లిటిల్ హార్ట్స్'మూవీ మరోసారి రుజువు చేసింది. తాజాగా ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో చర్చనీయంగా మారాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలేంటీ.
టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్' (K Ramp). ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివ బొమ్మక, రాజేష్ దండా (Rajesh Danda) సంయుక్తంగా నిర్మించారు.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ పై పడ్డారు. ఈ క్రమంలో గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత రాజేష్ దండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ రాజేష్ దండా, ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లలో జరుగుతున్న డ్రామాలపై వ్యంగ్యంగా మాట్లాడారు.
ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. "ఆ మధ్య నేను నా సినిమా ప్రమోషన్స్‌లో తొడ కొట్టాను. మరొకరు ఎమోషనల్ అయ్యారు, కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఎవరో ఒకరు అటెన్షన్ కోసం ఏదో చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత ఎమోషన్ చూపించినా, సింపతీ కార్డులు వాడినా, సినిమాలు కంటెంట్ బాగోలేకపోతే ఆడవు. ప్రేక్షకులు ఇప్పుడు చాలా తెలివైనవారు. సినిమా బాగుంటే మాత్రమే థియేటర్స్‌కి వస్తారు," అని స్పష్టంగా అన్నారు.
అంతకుముందుకు విలేకరుల సమావేశంలో నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కిరణ్‌గారు కుమార్ అబ్బవరం పాత్రలో నటించారు. కథ విన్న వెంటనే నాకు చాలా ఎగ్జైట్‌మెంట్ కలిగింది. మా సినిమాకు సెన్సార్ వాళ్లు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు అంటే, అందులో అసభ్య పదాలు ఉన్నాయని కాదు. ఇందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ప్రేరణ పొందేలా ఉండవచ్చనే కారణంతోనే ఆ సర్టిఫికెట్ ఇచ్చారు... అంతే. వల్గారిటీ ఎక్కడా లేదు," అని తెలిపారు. అంతేకాక, "'కె-ర్యాంప్' సినిమా కిరణ్‌గారి వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా బ్లాస్ట్ అవుతుంది. ఈ సినిమాతో నిర్మాత శివతో నాకు మంచి ప్రయాణం మొదలైంది. నా మీద నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమాలో భాగమయ్యారు శివ," అని చెప్పారు.
తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ "ప్రస్తుతం మా బ్యానర్‌లో హీరోయిన్ సంయుక్తతో ఒక సినిమా చేస్తున్నాం. అలాగే 'అల్లరి' నరేశ్‌గారితో కూడా ఒక కొత్త సినిమా ఉంది " అని రాజేష్ దండ వెల్లడించారు. అలాగే.. ట్రోలింగ్ విషయంపై స్పందిస్తూ "బన్నీ వాసుగారు టార్గెటెడ్ ట్రోలింగ్ గురించి మాట్లాడిన విషయాన్ని నేను ఫాలో కాలేదు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాను," అని అన్నారు. రాజేష్ దండా చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా నిలిచాయి.
ఈ వ్యాఖ్యలతో ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్నదానిపై సినీ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల కొన్ని చిత్రాల ప్రమోషన్లలో హీరోలు, దర్శకులు కన్నీళ్లు పెట్టుకోవడం, వ్యక్తిగత సెంటిమెంట్స్ వాడుకోవడం చూసిన ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఆ ట్రిక్‌లను పట్టేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











