Narayan Das Narang మా నాన్న లేని లోటు ఎవరూ పూడ్చలేరు.. ఆయన వల్లే ఘోస్ట్ మూవీ.. నిర్మాత సునీల్ నారంగ్ ఎమోషనల్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాణ సారథ్యంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ది ఘోస్ట్. దసరా కానుకగా ఈ సినిమా అన్ని హంగులతో అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఏషియన్ ఫిలింస్‌ను ప్రతిష్టాత్మకంగా మలిచిన తన తండ్రి నారాయణ్ దాస్ నారంగ్‌ను తలుచుకొని నిర్మాత సునీల్ నారంగ్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ..
ది ఘోస్ట్ సినిమాతో మా నాన్న స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్‌కు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మా నాన్న పుట్టిన రోజునే ఈ సినిమా ప్రారంభమైంది. మా నాన్న గారిపై ఉన్న గౌరవం కారణంగానే నాగార్జున అక్కినేని మాకు డేట్స్ ఇచ్చారు. అందుకు మా కుటుంబం తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాన్న ఈ సినిమాను చూడలేదు. ఈ సినిమాను మా నాన్నకు అంకితం ఇస్తున్నాం. టైటిల్‌లో మా గ్రాటిట్యూడ్‌ను తెలియజేసుకొంటున్నాం అని సునీల్ నారంగ్ అన్నారు.

ది ఘోస్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు చాలా బాగా డీల్ చేశారు. ఆయన టెర్రిఫిక్ డైరెక్టర్. కోవిడ్ కారణంగా బడ్జెట్ ఎక్కువైంది. కథ డిమాండ్ మేరకు ఫైట్స్, యాక్షన్ సీన్లను హై రేంజ్‌లో ఖర్చు చేశాం. దుబాయ్‌లో షూట్ చేశాం. చాలా కారణాల వల్ల బడ్జెట్ పెరిగింది.
నాగార్జున మార్కెట్‌కు మించి బడ్జెట్ అయింది. అయితే హీరో రేంజ్‌ను కాకుండా కంటెంట్‌ను బట్టి సినిమా కోసం ఖర్చుపెడుతాం. ది ఘోస్ట్ గురించి మా రేంజ్‌లోనే బడ్జెట్ అయిందని నమ్ముతున్నాం అని సునీల్ నారంగ్ చెప్పారు.

మా నాన్న గారు లేకపోవడం చాలా బాధగా ఉంది. మాకు చాలా లోటు ఉంది. ఆ లోటును పూర్తి చేయడం కష్టం. ఆయన మాతోనే ఉన్నారనే అనుకొని ముందుకు వెళ్తున్నాం. ఆయన స్పూర్తి మాకు ఎప్పటికి ఉంది.


Click it and Unblock the Notifications











