PSPK-Rana Movie Shoot started: పవర్ స్టార్ రచ్చ మళ్లీ మొదలైంది.. మరోసారి గాయకుడిగా..

మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్‌గా రూపొందుతున్న పవన్ కల్యాణ్ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగును జూలై 26వ తేదీన మొదలుపెట్టారు. దీంతో PSPKRanaMovie హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఈ షూటింగుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో

హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నది. ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిపై కీలక పోరాట సన్నివేశాలను షూట్ చేయడానికి దర్శకుడు సాగర్ కే చంద్ర ప్లాన్ చేశారనే విషయం వెల్లడైంది.

సంక్రాంతి బరిలో పవర్ స్టార్

సంక్రాంతి బరిలో పవర్ స్టార్

పవన్ కల్యాణ్ షూటింగుకు హాజరైనట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. మాస్ అవతారంలో పవన్ కల్యాణ్ ఉన్న ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. సంక్రాంతి 2022లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు.

 సినిమాటోగ్రాఫర్‌గా రవి కే చంద్రన్

సినిమాటోగ్రాఫర్‌గా రవి కే చంద్రన్

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి చిత్రానికి ఇప్పటి వరకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే డేట్స్ సమస్య కారణంగా ప్రస్తుతం ఈ సినిమాకు ప్రసాద్ మూరేళ్ల దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తారనే విషయం తెలిసింది.

పవన్ కల్యాణ్ నోట మళ్లీ పాట

పవన్ కల్యాణ్ నోట మళ్లీ పాట

అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చిత్రంలో పవన్ కల్యాణ్ చేత ఓ పాటను నిర్మాత నాగవంశీ పాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. జానపద బాణితో సాగే ఈ పాటను పవర్ స్టార్ త్వరలోనే పాడుతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కొడకా కోటేశ్వరరావు అనే పాటను పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాడించిన సంగతి తెలిసిందే.

రాయలసీమ యాస, భాషలో

రాయలసీమ యాస, భాషలో

ఇక పవన్ కల్యాణ్ గెటప్, యాటిట్యూడ్ ఈ సినిమాకు హైలెట్‌గా మారుతుందనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రాయలసీమ యాస, భాషలో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ కిర్రాక్ అని అభిమానులు అంటున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు.

పవన్ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

పవన్ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, ఐశ్వర్య రాజేశ్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: ఎస్ థమన్
డీవోపి: ప్రసాద్ మూరేళ్ల
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్: సంక్రాంతి 2022

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X