Puri Jagannadh: ఛార్మితో నా బంధం అదే.. రిలేషన్ పై పూరి క్లారిటీ
Puri Jagannadh: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అలాగే.. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోడు.. వైఫల్యాలకు బాధపడడు. హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ.. మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అందుకే పూరీని టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటారు. అయితే.. గత కొంత కాలంగా ఆయనకు నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్ సమాధానమిచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రీసెంట్‌లో బాక్సాఫీస్ దగ్గర కొంత స్లో అయ్యారన్న వార్తలు వస్తున్నా, ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి దర్శకత్వంలో 'లైగర్'భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, తీరా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అంతకుముందుకు కూడా పూరీ సినిమాలు ఇలానే బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ టబు కీలక పాత్రలో నటిస్తున్నది. హీరోయిన్‌గా సంయుక్త మీనన్ కనిపించనుంది.

ఇకపోతే.. పూరి జగన్నాథ్, నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధంపై ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ మధ్య పూరి-విజయ్ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి రూమర్స్ భారీ ఎత్తున వచ్చాయి. వాటిపై పలుమార్లు పూరి జగన్నాథ్, ఛార్మీ లు తమ సంబంధంపై స్పష్టత ఇచ్చారు. తాము కేవలం స్నేహితులమే అనీ చెప్పినా.. ఆ రూమర్స్ కు చెక్ పడటం లేదు.
తాజాగా పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య లివింగ్రిలేషన్షిప్ఉన్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో స్పందించారు. "ఛార్మీ 13 ఏళ్ల వయసు నుండి నాకు తెలుసు. గత 20 ఏళ్లుగా మా మధ్య స్నేహం కొనసాగుతోంది. మేమిద్దం కలిసి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పని చేసాం. అయితే, మా మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని స్పష్టంగా చెప్పగలను. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కేవలం యంగ్ ఏజ్ కారణంగానే ఉన్నాయి. ఛార్మీకు ఇంకా పెళ్లి కాలేదు, అందుకే ఈ పుకార్లు వస్తున్నాయి. ఆమె 50 ఏళ్ల వయసులో మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి అంత పెద్దగా పట్టించుకోరు. ఆమె లావుగా ఉన్నా, మరో వ్యక్తిని పెళ్లాడినా, ఎవరికీ ఎలాంటి బాధ ఉండదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది శాశ్వతం"అని పేర్కొన్నారు.
ఇక మరోవైపు, కేవలం 15 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది పంజాబీ సుందరి ఛార్మీ కౌర్. రెండు దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ అనేక విజయాలు, పరాజయాలను ఎదుర్కొంది. 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మి సినిమాలో ఆమె హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తో కలిసి 'పూరి కనెక్ట్స్' అనే బ్యానర్‌ను స్థాపించి, నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో రోగ్, పైసా వసూల్, మెహబూబా వంటి సినిమాలను నిర్మించింది.
అయితే వీటిలో పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. వరుస పరాజయాల వల్ల ఛార్మీ ఆర్థికపరంగా కూడా గట్టి దెబ్బతిన్నట్టు సమాచారం. అయినప్పటికీ, ఆమె దైర్యం మాత్రం తగ్గలేదు. ఎప్పటిలాగే పూరి జగన్నాథ్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తూ తన కెరీర్‌ను మళ్లీ పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పూరి స్పష్టత ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికపై పుకార్లు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్-ఛార్మీ మధ్య కేవలం స్నేహం, ప్రొఫెషనల్ సంబంధమే కొనసాగుతుందన్న క్లారిటీ ప్రేక్షకులకు, అభిమానులకు స్పష్టమయ్యింది.


Click it and Unblock the Notifications











