Don't Miss!
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆసక్తికిని రేకెత్తించేలా అశ్వథ్థామ ట్రైలర్
యంగ్ హీరో నాగ శౌర్య మాస్ అవతారమెత్తి కొత్తగా ట్రై చేస్తోన్న చిత్రం అశ్వథ్థామ. ఇంతవరకు చాక్లెట్ బాయ్‌లా అమ్మాయిల వెంటపడే అల్లరి కుర్రాడి పాత్రలో కనిపించాడు. అయితే నాగ శౌర్య నుంచి రాబోయే చిత్రంలో రూట్ మార్చేశాడు. ఈ సారి అమ్మాయిలను టార్చర్ చేసే సైకోలను మట్టుబెట్టేందుకు వస్తున్నాడ. ఆ మధ్య విడుదల చేసిన అశ్వథ్థామ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, టీజర్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీలో నాగ శౌర్య యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. 'రాక్షసుడిని, భగవంతున్ని చూసిన కళ్లు ఇక ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతే'.. 'ఎటువైపు వెళ్లిన మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు... వేట కుక్కల్లా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఓ ముసలోడు.. వీరందరినీ ఒకే స్టేజ్ మీద ఆడించే ఆ సూత్రధారి ఎవరు'.. 'వంద కథలు వేల పుకార్లు పుట్టించే వరకు వదిలిపెట్టరా' చెప్పిన డైలాగ్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ చిత్రానికి నాగ శౌర్యే కథ అందించడం విశేషం. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా.. రమణ తేజ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 31న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నాగ శౌర్యకు జోడిగా మెహ్రీన్ నటిస్తోంది.