Pushpa vs KGF 2: అసలైన బాక్సాఫీస్ యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్!

బిగ్గెస్ట్ పాన్ ఇండియా అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. RRR మాత్రమే కాకుండా ఆ తరువాత పుష్ప కూడా అదే హై వోల్టేజ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ అనగానే మొదట లవ్ స్టొరీ అనుకున్నారు కానీ ఆ తరువాత సినిమా ఫస్ట్ లుక్ తో ఊర మాస్ సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై చిత్ర యూనిట్ మరో అధికారిక క్లారిటీ అయితే ఇచ్చేసింది.

ఫస్ట్ లుక్ టీజర్ తోనే

ఫస్ట్ లుక్ టీజర్ తోనే

పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రతి విషయంపై కూడా ఎదో ఒక రకంగా బజ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక మొదట ఫస్ట్ లుక్ టీజర్ తోనే అన్ని భాషల్లో తగ్గేదేలే.. అనే డైలాగ్ తో హైప్ క్రియేట్ చేశారు. 78మిలియన్స్ వ్యూవ్స్ తో సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా వ్యూవ అందుకున్న టీజర్స్ లో ఒకటిగా పుష్పరాజ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

షాక్ ఇచ్చిన కాంబినేషన్

షాక్ ఇచ్చిన కాంబినేషన్

దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఈ సినిమా కోసం నెవ్వర్ బిఫోర్ అనేలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మొదట ఏదైనా లవ్ స్టోరీతో వస్తారని అనుకున్న ఈ కాంబినేషన్ ఒక విధంగా అందరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మొత్తానికి సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే విధంగా తెరకెక్కిస్తున్నారు.

పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. సినిమా రిలీజ్ ను ఇదే ఏడాది విడుదల చేయనున్నారు. డిసెంబర్ 2021 అని అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. డిసెంబర్ 24న రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప ట్యాగ్ సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది.

KGF 2 కూడా అదే టైమ్ లో

KGF 2 కూడా అదే టైమ్ లో

అంతా బాగానే ఉంది గాని పుష్ప కంటే ముందే KGF 2 సినిమా క్రిస్టమస్ ను బుక్ చేసుకుంది. అసలైతే ఆ సినిమా జూలైలోనే ప్రేక్షకుల ముందుకి రావాల్సింది. కానీ అనుకోకుండా ఆ సినిమా కూడా కరోనా వలన వాయిదా పడక తప్పలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో యష్ కు ప్రతి నాయకుడిగా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే.

పుష్ప vs KGF

పుష్ప vs KGF

ఇదివరకే పుష్ప vs KGF అనే ట్యాగ్ సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యింది. ఒక్క పుష్ప సినిమా 10 KGF లతో సమానం అంటూ ఆ మధ్య దర్శకుడు బుచ్చిబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఫ్యాన్స్ మధ్యలో కూడా ఒక వార్ మొదలైంది. రెండు వినిమాలు సంబంధించిన అప్డేట్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఎక్కడా తగ్గకుండా..

ఎక్కడా తగ్గకుండా..

పుష్ప సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఎక్కడా తగ్గకుండా ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమా మేకింగ్ విషయంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ మరో లెవెల్లో ఆలోచిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంస్థ భారీ బడ్జెట్ ను కేటాయించింది.

నేషనల్ వైడ్ గా ట్రెండ్

నేషనల్ వైడ్ గా ట్రెండ్

ఇక మరోవైపు KGF 2 కూడా అంచనాలకు తగ్గట్లుగానే తెరకెక్కుతోంది. KGF 1 భారీ విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 2పై అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ఇక పుష్ప సినిమాకు గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు.

పుష్ప 2.. ఎప్పుడంటే?

పుష్ప 2.. ఎప్పుడంటే?

ఇక పుష్ప 2 షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయ్యింది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు. ముందైతే పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలకు మినిమమ్ ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని అనుకున్నారు. ఇక పుష్ప 2 విషయంలో కూడా సుకుమార్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను విడుదల చేస్తుందో లేదో చూడాలి.

Recommended Video

Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
అంతకుమించి అనేలా ఐటెమ్ సాంగ్

అంతకుమించి అనేలా ఐటెమ్ సాంగ్

ఇక పుష్ప సినిమాలో సన్నీ లియోన్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే ఐటెమ్ సాంగ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అంతకుమించి అనేలా అంచనాలు ఉన్నాయి. ఇక ఐటెమ్ సాంగ్ కోసమని సన్నీకి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారాట. ఇక మరోవైపు దేవిశ్రీప్రసాద్ కూడా మ్యూజిక్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలని కంపోజ్ చేస్తున్నాడు. ఇక సినిమాలోని మొదటి సాంగ్ ను కూడా RRR తరహాలోనే 5 భాషల్లో 5 మంది డిఫరెంట్ సింగర్స్ తో విడుదల చేయాలని అనుకుంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X