Pushpa: నోట్లో కత్తితో ‘దాక్కో దాక్కో మేక’ అంటూ ఊరమాస్ లుక్‌లో అల్లు అర్జున్. ఫాన్స్ కి పూనకాలే!

చివరిగా అల వైకుంఠపురం సినిమాలో ప్రజలు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో పోటీపడి సంక్రాంతి రేసులో ఆ సినిమా కి గట్టి పోటీ ఇచ్చింది. రెండు సినిమాల వాళ్ళు ఎవరికి వారు తామే సంక్రాంతి విన్నర్స్ అని చెప్పుకుంటున్నా రెండు సినిమాలు బాగానే ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు కూడా రెండు సినిమాలను ఆదరించారు.. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా ప్రారంభించాడు. సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఇప్పటివరకు నటించినటువంటి రీతిలో ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. లారీ డ్రైవర్ రేంజ్ నుంచి ఆయన ఒక మాఫియా డాన్ రేంజ్ కి ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో కూడా సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా మొత్తం మీద ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఐదు భాషల్లో సినిమా యూనిట్ ప్రచారం చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన దాక్కో దాక్కో మేక అనే ఒక సినిమా పాటకు సినిమా యూనిట్ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తోంది.

Pushpa Movie Dakko Dakko Meka Song Promo Released

కొద్దిరోజుల క్రితం ఈ పాటకు విడుదలకు సంబంధించిన ప్రకటన చేయగా ఇప్పుడు రోజుకో సారి ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విభిన్న రూపాల్లో విడుదల చేస్తున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటంటే ఈ కేవలం 11 సెకన్ల ప్రోమో లోనే ఆయన నోట్లో కత్తి పెట్టుకుని ఏదో జాతరలో ఉన్నట్లు ఒక మాస్ లుక్ లో చూపించారు. దీంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పాట ఆగస్టు 13వ తేదీన ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక క్రిస్మస్ కి విడుదల చేస్తామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది కానీ తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు. మరి చూడాలి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X