'పుష్ప' రాజ్ అరాచకం.. నెంబర్ 2 కాదు నెంబర్ వన్.. KGF కూడా దిగిపోయింది

టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి రోజురోజుకు దేశవ్యాప్తంగా తన స్థాయిని పెంచుకుంటొంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమా పాన్ ఇండియా బజ్ అంటే ఏమిటో చూపిస్తున్నాయి. బాహుబలి అనంతరం లెక్కలు మొత్తం మారిపోయాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరొక రికార్డు క్రియేట్ చేయడం పక్కా అని తెలుస్తోంది. దెబ్బకు సినిమా KGF 2ను దింపేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపడం విశేషం.

Recommended Video

Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
పది KGF లతో సమానం అనగానే..

పది KGF లతో సమానం అనగానే..

ఇటీవల ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన గురువు మీద ఉన్న నమ్మకంతో పుష్పను పొగుడుతూ KGF 2ను తగ్గించి మాట్లాడినట్లు విమర్శలు అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప పది KGF లతో సమానం అనగానే అందరూ షాక్ అయ్యారు. ఒక విదంగా కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెంబర్ వన్ స్థానంలో

నెంబర్ వన్ స్థానంలో

అయితే ఇటీవల KGF 2 నెంబర్ వన్ స్థానంలో ఉండగా పుష్ప కారణంగా నెంబర్ 2కు పడిపోయింది. ఇక పుష్ప రాజ్ నెంబర్ వన్ స్థానంలోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మూడవ సినిమా కావడంతో ఒక్కసారిగా అంచనాల స్థాయి అమంతగా పెరిగిపోయింది. టీజర్ కూడా మరింత డోస్ పెంచేసింది.

పుష్ప దెబ్బకు డిగిపోయిన KGF 2

పుష్ప దెబ్బకు డిగిపోయిన KGF 2

ప్రముఖ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) వెబ్ సైట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఎక్కువ మంది ఆసక్తితో ఎదురుచూస్తున్న పెద్ద సినిమాల్లో పుష్ప నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎప్పటికప్పుడు నెటిజన్ల ఓట్లతో IMDB లో స్థానాలు మారిపోతుంటాయి. అయితే ఉదయం KGF 2 నెంబర్ 1లో ఉండగా పుష్ప ట్రెండింగ్ దెబ్బకు కిందకు దిగిపోయింది.

ఉదయం నెంబర్ 2 స్థానంలో

ఉదయం నెంబర్ 2 స్థానంలో

సోషల్ మీడియాలో నెంబర్ 2 స్థానంలో ఉన్నట్లు ట్యాగ్ ట్రెండ్ అయిన కొద్దీ క్షణాల్లోనే పుష్ప వెంటనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ రికార్డుతో జనాలు సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X