ఆ వయస్సులో అవేవీ తెలియవు.. దర్శకుడే మార్చేశాడు.. బాలకృష్ణ ఎలాంటి వారంటే: రాశి కామెంట్స్
14 ఏళ్ల వయస్సులోనే వెండితెర గడపతొక్కిన రాశి.. బాల నటిగా రాణించి చివరకు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. వెండితెర అందాలకు చిరునామా అన్నట్లుగా సాగిన రాశి సినీ ప్రయాణంలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి భేష్ అనిపించుకుంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈ అచ్చ తెలుగు హీరోయిన్ తాజాగా జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో తన సినీ కెరీర్ లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. వివరాల్లోకి పోతే..

రాశి కెరీర్ ఆరంభం నుంచి పెళ్లి దాకా.. స్టార్ హీరోలు
గోకులంలో సీత, ప్రేయసీ రావే, సుప్రభాతం లాంటి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది రాశి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తన కెరీర్ ఆరంభం, పెళ్లి, స్టార్ హీరోలు ఇలా ఎన్నో విషయాలపై తాజా ప్రోగ్రాంలో స్పందించింది. గతంలో ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు రివీల్ చేసింది రాశి.

ఆ దర్శకుడే పేరు మార్చాడు
తెలుగులో హీరోయిన్‌గా తన మొదటి సినిమా 'శుభాకాంక్షలు' అని చెప్పిన రాశి.. ఈ సినిమా డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ తన అసలు పేరును రాశిగా మార్చేశారని తెలిపింది. తన అసలు పేరు విజయ అని ఈ సందర్బంగా ఆమె వెల్లడించింది. అలా తాను దాదాపు 75 చిత్రాల్లో నటించి ఉంటానని తెలిపింది రాశి.

మెగాస్టార్ సతీమణి వాళ్ళింటికి పిలిపించుకొని మరీ..
ఇక.. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ వాళ్ళింటికి పిలిపించుకొని మరీ 'గోకులంలో సీత' సినిమాలో తనను పెట్టుకోండని చెప్పినట్లుగా రాశి పేర్కొంది. తమకు 'గోకులంలో సీత' టీమ్ నుంచి పిలుపు రాగానే ఆల్బమ్ తీసుకొని వాళ్ళింటికి వెళ్లామని చెప్పింది. చిరంజీవి గారు పిలిచారనుకుంటే.. పిలిచింది సురేఖ గారని అక్కడికెళ్ళాక తెలిసిందని చెప్పింది. అలా ఆ సినిమా అవకాశం దక్కిందని తెలిపింది రాశి.

14 ఏళ్ల వయస్సు.. ఆ వయసులో
తాను 14 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి రావడం జరిగిందని, ఆ వయసులో స్టార్ డమ్ లాంటి వాటి గురించే తెలియదని రాశి చెప్పింది. ఏదో సరదాగా సినిమాలు చేసేదాన్నని, బయట క్రేజ్ ఎలా ఉంటుంది, నా రెమ్మ్యూనరేషన్ ఎంత అలంటి విషయాలు కూడా తనకు తెలియదని రాశి తెలిపింది.
Recommended Video

బాలకృష్ణ ఎలాంటి వారంటే
సీనియర్ హీరో బాలకృష్ణ సరసన చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'బాలగోపాలం' సినిమాలో చేసింది రాశి. ఆ తర్వాత అదే హీరోతో 'క్రిష్ణబాబు' సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. ఈ నేపథ్యంలో బాలయ్యబాబు గురించి మాట్లాడిన రాశి.. చిన్న వయసులో నాతో ఎంత ఆప్యాయంగా ఉండేవారో, హీరోయిన్ గా చేస్తున్నపుడు కూడా బాలకృష్ణ గారు అంతే ఆప్యాయత చూపించారని తెలిపింది.


Click it and Unblock the Notifications











