twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు దర్శకుడి ‘రాకెట్రీ’.. జస్ట్ లో మిస్సయి మాధవన్ చేతికి.. ఆసక్తికర విషయాలు బయటకు!

    |

    టాలీవుడ్ లో అంకుల్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజ్ మాదిరాజు తరువాతి కాలంలో రిషి అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు నంది అవార్డులలో బెస్ట్ స్టోరీ కేటగిరీలో అవార్డు కూడా దక్కింది. ఆ తరువాత ఈ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత ఆయన పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి డెబ్యూ సినిమా ఆంధ్ర పోరి అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఆయన నటుడిగా చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు.

    తండ్రి పాత్రలలో

    తండ్రి పాత్రలలో

    అంకుల్, ఆంధ్ర పోరి, కళ్యాణవైభోగమే, అప్పట్లో ఒకడుండేవాడు, మజ్ను, రాజా మీరు కేక, ఉన్నది ఒకటే జిందగీ, జవాన్, మెంటల్ మదిలో, ఐతే 2.0, బ్రోచేవారెవరురా, ప్రెజర్ కుక్కర్, కృష్ణ అండ్ హిస్ లీల సహా మరెంన్దో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. నిజానికి ఆయన ఎక్కువగా తండ్రి పాత్రలలో కనిపిస్తుండేవారు. అయితే తాజాగా ఆయన రాకెట్రీ సినిమా గురించి కామెంట్ చేశారు.

    హతాశులమయ్యామని

    హతాశులమయ్యామని


    అయిదేళ్లక్రితం మాంటేజెస్‌లో ఉండగా ఆయన మీద సినిమా చేయాలనిపించిందని, వెంటనే నంబి నారాయణన్‌ని కాంటాక్ట్ చేసి కలవాలని చెప్పామని అన్నారు. ఆ తరవాత మూడునాలుగు నెలల పాటు మాట్లాడుతూ, మా ప్రయాణం, దాని ఉద్దేశ్యం గురించి ఆయనకు చెప్తూనే ఉన్నామని, ఆయన మాకు మెటీరియల్ పంపారు.. రెండు పుస్తకాలు కూడా ఇచ్చారని అన్నారు. పూర్తి ప్రిపరేషనుతో కేరళ వెళ్ళి ఆయనని కలిశాము.. మేము ఊహించని విధంగా ఆయన బాంబు పేల్చారని, సరిగ్గా వారం రోజుల క్రితమే మాధవన్ వొచ్చి రైట్స్ రాయించుకుని వెళ్ళాడని తెలిసిందన్నారు. మాధవన్, అనంత మహదేవన్ (డైరెక్టర్, యాక్టర్) తనని యేళ్ళ తరబడి ఫాలో అప్ చేస్తూ ఉన్నారని చెప్పడంతో హతాశులమయ్యామని అన్నారు.

    ఎగ్జైటెడ్‌గా

    ఎగ్జైటెడ్‌గా


    అనంత మహదేవన్ అంతకుముందే మోహన్ లాల్ తో ఈ కథను సినిమాగా మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశాడు కాబట్టి సో, ఆయన మాధవన్ తీసుకున్నాడని చెప్పగానే తీవ్ర నిరాశ చెందినా ఏమీ చేయలేకపోయామని అన్నారు. అయినా ఆలోచిస్తే మాధవన్‌కి ఉన్న రిసోర్సెస్ మాకు లేవు, మాకు అతనికన్నా ఎన్నోరెట్లు ఎక్కువ కష్టం, సో, ఈ కథకు అతను మాకన్నా ఎక్కువ న్యాయం చేయగలడని భావించామని అన్నారు. నంబి మాకు తన ఇల్లు, అవార్డులు, ఫోటోలు, ఆర్టికిల్స్ అన్నీ ఎగ్జైటెడుగా చూపించారు.. ఒక చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా.. ఒక మంచి ఫీలింగుతో తిరిగొచ్చామని ఆయన అన్నారు. మాధవన్‌తో కొద్దిగా కాంటాక్ట్ ఉండడంతో అతనికి మెసేజి పెట్టానని, తనూ ఎగ్జైటెడ్‌గా రెస్పాండయాడని పేర్కొన్నారు.

    పకడ్బందీగా

    పకడ్బందీగా


    అనంత మహదేవన్, తరవాత ఇంకొకతను ప్రాజెక్టులోకి డైరెక్టర్లుగా వొచ్చి వెళ్ళిపోయారు.. మాధవన్ తనే డైరెక్షను కూడా స్వయంగా చేశాడు. రాకెట్రీ సినిమా చూశాను.. నా నమ్మకం నిజమైంది.. మేము తీసి ఉంటే అంత పకడ్బందీగా చేయగలిగి ఉండేవాళ్లం కాదు.. బాగా ఖర్చుపెట్టి డీటెయిల్స్ ఏమాత్రం మిస్సవకుండా తీశాడని అన్నారు. అడుగడుగునా నంబి కనిపించారు.. ముఖ్యంగా ఫస్ట్ హాఫులో.. టెక్నికల్‌గా బాగా స్ట్రాంగుగా ఉంది స్క్రిప్టు.. యాక్టర్లందరూ బాగున్నారు.. స్పెషల్‌గా చెప్పుకోవలసింది ఆర్టు, మేకప్ అని చెప్పుకొచ్చారు.

     ఆమెజాన్ ప్రైంలో

    ఆమెజాన్ ప్రైంలో

    ఈ స్క్రిప్టు రాస్తున్నసమయంలో నేను "కన్ఫెషన్స్ ఆఫ్ ఆన్ ఎకనామిక్ హిట్‌మాన్" కూడా చదివానని, సీఐయే ఒక పథకం ప్రకారం పకడ్బందీగా ప్లాను చేసి దేశాల పురోగతిని ఎలా నాశనం చేస్తారో గొప్పగా చెబ్తాడని అన్నారు. ఈ పుస్తకంతో పాటు నాయర్ నంబి మామూలు సైంటిస్టు కాదు.. ఓ అర్జున్ రెడ్డి.. మేము కలిసినప్పుడు ఆయన వయసు డెభ్భయ్యారేళ్ళు.. అయినా మహా దూకుడుగా, క్షణంపాటు ఊపిరి తీసుకోకుండా నవ్వుతూ నవ్విస్తూ పరిగెడుతూకదులుతూ ఉన్నారని అన్నారు. ఈ సినిమా కొన్నిరోజులు వెంటాడుతుంది.. చూడండి అని కోరారు. ఇక ఈ సినిమా ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Raj Madiraju interesting comments on rocketry movie and his plans of nambi narayan biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X