తమిళ దర్శకులకు తలనొప్పిగా మారిన రాజమౌళి.. దారుణమైన వ్యాఖ్యలతో టార్చర్.. పాపం ఆడేసుకుంటున్నారుగా!

బాహుబలి సినిమాలో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి ఇప్పుడు తాజాగా RRR సినిమాతో కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పాడు. భారతదేశం నుంచి మొట్టమొదటిసారి బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాగా ఇప్పుడు RRR కూడా అదే బాటలో పయనిస్తోంది. అయితే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు తమిళ దర్శకులకు తలనొప్పిగా మారింది. అదేంటి రాజమౌళికి క్రేజ్ వస్తే తమిళ్ దర్శకులకు తలనొప్పిగా మారడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా అయితే అసలు విషయం తెలుసుకుందాం పదండి

Recommended Video

Kollywood Directors కి తలనొప్పిగా మారిన Rajamouli | RRR Movie | Filmibeat Telugu
 అడపాదడపా

అడపాదడపా

నిజానికి తమిళ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ కంటే కాస్త బలమైనది అనే చెప్పుకోవాలి. తమిళ చిత్ర పరిశ్రమలో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తాయి అని పేరు ఉంది. అలాగే సాంకేతికపరంగా కూడా తెలుగులో ఉన్న టెక్నీషియన్స్ కంటే తమిళం లో ఉన్న టెక్నీషియన్స్ సాంకేతికంగా ముందున్నారని భావించవచ్చు. కానీ అలాంటి చిత్ర పరిశ్రమ నుంచి ఒక గట్టి టెక్నికల్ సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అడపాదడపా శంకర్ అలాంటి సినిమాలు చేయడం తప్ప తమిళ సినీ పరిశ్రమ నుంచి బాహుబలి లాంటి సినిమాలు రావడం అనే ఆలోచన లేకుండా పోయింది.

చూసి నేర్చుకోవాలి అంటూ

చూసి నేర్చుకోవాలి అంటూ


అయితే బాహుబలి రెండు భాగాలు తాజాగా విడుదలై హిట్ కొట్టి, మొన్న పుష్ప ఇప్పుడు RRR వంటి సినిమా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకోవడం తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకరిస్తోంది. అందుకే తమిళ సినీ ప్రేమికులు తమ తమిళ దర్శకులు రాజమౌళి ని చూసి నేర్చుకోవాలని భారీ బడ్జెట్ సినిమాలు ప్రపంచ స్థాయిలో నిలబడే సినిమాలు ఎలా చేయాలో ఆయనను చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎవరూ లేరని

ఎవరూ లేరని


తమిళ సినిమా పరిశ్రమకు కమర్షియల్ ఐడియాలజీ తెలిసిన రాజమౌళి లాంటి దర్శకులు ఎవరూ లేరు.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎలా అయితే సినిమాలను తెరకెక్కించి హిట్లు కొడుతున్నారో తమిళ సినీ దర్శకులు కూడా వాటిని చూసి నేర్చుకోవాలి అంటూ ఒక తమిళ్ నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే తమిళ నెటిజన్లు చెబుతున్న మరో పాయింట్ ఏమిటంటే తెలుగు సినిమాకు చెందిన ఇద్దరు బడా స్టార్ హీరోలను రాజమౌళి తీసుకువచ్చి సినిమా చేసినట్లు తమిళ సినీ పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోలు తీసుకువచ్చి సినిమా చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఎవరూ లేరని బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారమే తమిళ దర్శకులకు తలనొప్పిగా మారింది. నిజానికి తమిళ సినీ పరిశ్రమను అక్కడి వాళ్లు బాగా వెనకేసుకు వస్తూ ఉంటారు కానీ రాజమౌళి విషయంలో మాత్రం అక్కడి దర్శకులు ఆయనని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రాజమౌళి నిజమైన దేశభక్తుడు

రాజమౌళి నిజమైన దేశభక్తుడు


ఒక తమిళ నెటిజన్ అయితే ఏకంగా చెప్పలేని భాషలో రాజమౌళి దగ్గర నుంచి ఒక గ్లాసు *చ్చ తెచ్చుకుని తాగండి, ఆయన ఒక లెజెండ్ సినీ పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ ఎంటర్టైనర్ గా సినిమా నిలిచిపోతుంది అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ రాజమౌళి నిజమైన దేశభక్తుడు భారత దేశానికి ఇలాంటి సినీ దర్శకులు కావాలి తమిళ సినిమాలో మన కల్చర్ ని చూపించడం మానేశారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు..

డైరెక్టర్ల మీద ఒత్తిడి

డైరెక్టర్ల మీద ఒత్తిడి


మరొకరు తమిళ్ సినిమా దర్శకులు ఏమైంది? తెలుగు వాళ్లు బాహుబలి, పుష్ప, RRR లాంటి సినిమాలు చేసి భారతదేశాన్ని తమవైపు చూసేలా చేసుకుంటుంటే మనవాళ్లు ఎందుకు ఇలాంటి సినిమాలు కాకుండా ఎంటర్టైనర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన టాలెంట్ చూపించడానికి తమిళ ఫ్యాన్స్ కొంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది, డైరెక్టర్ల మీద ఒత్తిడి తీసుకు రావాలి అని మరొకరు కామెంట్ చేశారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X