RRR : టీజర్ డేట్ ఫిక్స్.. అంతకు మించి అనిపించేలా ప్లాన్ రెడీ.. ఇక రికార్డులు బద్దలే!

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి సంపాదించిన రాజమౌళి ఆ సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే .

బాహుబలి క్రేజ్

బాహుబలి క్రేజ్

బాహుబలి 2 పూర్తయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు. మొన్నీమధ్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయి విడుదల కూడా అవ్వాల్సి ఉన్నా అయితే అనూహ్యంగా ఎంటర్ అయిన కరోనా కారణంగా ఈ సినిమా అంతకంతకీ వెనక్కి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

జనవరి 7, 2022న

జనవరి 7, 2022న

అయితే అక్టోబర్ 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన సినిమా యూనిట్ బాగానే కష్టపడినా కరోనా మహమ్మారి రెండో దశ ఆ ఆశలను కూడా వమ్ము చేసింది. ఆ తేదీకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలే తక్కువ కనిపిస్తున్నాయని ముందు నుంచి ప్రచారం జరగ్గా ఇప్పుడు అదే నిజం అయి జనవరి 7, 2022న 'ఆర్ఆర్ఆర్ ' విడుదల చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ యూనిట్ తాజాగా ప్రకటించింది.

పది బాషలలో

పది బాషలలో

రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలో కాక మరో ఐదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లోనే కాక మరో అయిదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియా, స్పానిష్, టర్కిష్ భాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ కనిపించనుంది. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Recommended Video

RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Filmibeat Telugu
 ప్రమోషన్స్ మొద

ప్రమోషన్స్ మొద

ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు. తాజాగా వెల్లడవుతున్న సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ అన్ని భాషలకు సంబంధించిన సింగిల్ టీజర్ ఈ శుక్రవారం విడుదల కానుందని అంటున్నారు. ఇది కేవలం టీజర్ మాత్రమే కాదని అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు. రాధేశ్యామ్ ఇటీవల విడుదల చేసినట్టుగానే టీజర్ ఒకే భాషలో విడుదల చేయగా అదే విధంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు. ఈ దెబ్బతో కేజీఎఫ్ 2 టీజర్ కావడం ఖాయం అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X