Don't Miss!
- News
కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? జాగ్రత్త: షర్మిలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bheemla Nayak మూవీలో సీనియర్ హీరో: ఊహించని పాత్రతో సర్‌ప్రైజ్ చేస్తారట
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అతడి కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్'కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. ఇందులో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!
ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుతో నడిచే కథతో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు కూడా చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది.

'భీమ్లా నాయక్' మూవీలో ఎంతో మంది సీనియర్లు కీలక పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారట. కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ హవాను చూపిస్తోన్న ఆయన.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. అయితే, ఇందులో ఆయన ఇప్పటి వరకూ కనిపించని విధంగా సరికొత్త పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజేంద్ర ప్రసాద్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నాయకుడిగా నటిస్తున్నారట. ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.
Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర
క్రేజీ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌గా వస్తున్న 'భీమ్లా నాయక్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైనా అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు చేస్తోన్న పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదలయ్యాయి. వీటికి ఓ రేంజ్‌లో స్పందన దక్కింది. దీంతో ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి. అలాగే, ఈ మూవీ నుంచి పలు పాటలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవి కూడా ట్రెండ్ సెట్ చేసేశాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా అత్యధిక స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్ వీడియోతో పాటు ఓ పాట కూడా విడుదలైంది. వీటికి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్‌గా, రానా లోకల్ డాన్‌గా నటిస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.